విశేష చరిత్ర కలిగిన విజయ డైరీ వ్యవస్థాపకులకు తీరని అవమానం జరిగింది. చిత్తూరు జిల్లాలో విజయ డైరీ పేరు ఉన్న శిలాఫలకం తొలగించడమే కాకుండా, సంస్థ వ్యవస్థాపకులు ఎన్‌పీ వీరరాఘవులు నాయుడు విగ్రహాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. విగ్రహానికి వస్త్రాన్ని కప్పి ఒక మూలన పడేశారు. కింద ఉన్న దిమ్మెనూ నేలమట్టం చేశారు. సీఎం జగన్ డెయిరీ ఆస్తులను గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు కట్టబెడుతున్నారని అందుకే అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.