TSPSC పేపర్ లీకేజీ కేసులో దర్యప్తు ముమ్మరం
తాజా అరెస్ట్ లతో 22కు చేరిన నిందితుల సంఖ్య;
TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. నిందితులకు 33 లక్షలకుపైగా డబ్బులు అందినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కు 16 లక్షలు అందాయని స్పష్టం చేసింది. అదేవిధంగా 10 లక్షల రూపాయలకు నిందితుడు ప్రవీణ్ నుంచి రేణుక రాథోడ్ ఏఈ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసింది. రేణుక భర్త డాక్య, రాజేశ్వర్ కలిసి మరో ఐదుగురికి విక్రయించినట్లు గుర్తించారు. ఆరు లక్షలకు డీఈఓ పేపర్‌ను ఖమ్మానికి చెందిన దంపతులకు విక్రయించినట్లు తెలిపారు. ప్రశ్నాపత్రాలు అమ్మగా వచ్చిన డబ్బుతో రాజేశ్వర్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు.