అనంతపురం ఎస్‌కేయూలో వైఎస్ విగ్రహ ఏర్పాటుకు వీసీ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. వీసీ రామకృష్ణారెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వర్సిటీల్లో నేతల విగ్రహాలు పెట్టడం సరికాదని విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన త్యాగమూర్తులు విగ్రహాలు పెట్టకుండా వైఎస్‌ఆర్ విగ్రహం పెట్టడం సమంజసం కాదన్నారు. వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలన్నారు. వర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పెద్దఎత్తున ఉద్యమాలు చేపడుతామని విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.