వారణాసిలో 2036 ఒలంపిక్స్: ప్రధాని మోదీ

Update: 2025-04-12 09:30 GMT

విశ్వక్రీడలకు 2036లో భారత్ ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారాణసి పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 2036 ఒలంపిక్స్‌కు వారణాసి వేదిక కానుండటంతో రూ. 3,880 కోట్లతో రోప్‌వే‌లతో పాటు రోడ్లు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ.. కాశీ యువత ప్రపంచ వేదికపై మెరిసేందుకు ఈరోజే శిక్షణ ప్రారంభించాలని ప్రోత్సహించారు. యువతకు క్రీడా రంగంలో వృద్ధి అవకాశాలను అందించడానికి తాము నిరంతరం కృషి చేస్తామన్నారు. 2036లో ఎట్టి పరిస్థితులలో ఒలింపిక్స్‌ ఇండియాలోనే నిర్వహించడానికి ప్రభుత్వం నిరంతర ప్రయత్నం చేస్తుందన్నారు.

జిమ్మీకి అరుదైన గౌరవం

ఇంగ్లండ్‌ లెజండరీ పేసర్ జేమ్స్ అండర్సన్‌కు అరుదైన గౌరవం లభించనుంది. ఆయన క్రికెట్‌కు అందించిన సేవలకు‌గాను కామన్వెల్త్ దేశాలలో ప్రఖ్యాత 'నైట్ హుడ్' అవార్డుకు సిఫార్స్ చేశారు. ఈ సిఫార్స్‌ను బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ పంపగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ అవార్డుతో 'సర్' బిరుదును జేమ్స్ ఆండర్సన్‌కు ప్రధానం చేయనున్నారు. గతంలో భారత్ నుంచి సునీల్ భారతి మిట్టల్ ఈ అవార్డును స్వీకరించారు. కాగా, 'నైట్ హుడ్' అవార్డును అందుకోనున్న తొలి క్రికెటర్‌గా ఆండర్సన్ చరిత్ర సృష్టించనున్నాడు.

Tags:    

Similar News