ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు.దీనితో, పాకిస్తాన్‌పై భారత్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.గతంలో ఈ రికార్డు యువరాజ్ సింగ్ (29 బంతులు) పేరిట ఉండేది.అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అతి తక్కువ బంతులు ఆడి 50 సిక్సులు కొట్టిన ఆటగాడిగా అభిషేక్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డును సాధించడానికి అతనికి 263 బంతులు మాత్రమే పట్టింది. ఈ రికార్డు గతంలో సూర్యకుమార్ యాదవ్ (317 బంతులు) పేరిట ఉండేది.అభిషేక్ శర్మ తన ప్రతిభతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, తన గురువు యువరాజ్ సింగ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ఆటగాళ్ల రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఈ ప్రదర్శన అతనికి భవిష్యత్తులో భారత జట్టులో స్థానం పదిలం చేసే అవకాశం ఉంది. ఇక భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.