AFG vs BAN: టీ20 ప్రపంచ కప్‌ సెమీస్‌కు అఫ్గాన్‌..

ఇంటిముఖం పట్టిన బంగ్లాదేశ్‌, ఆసీస్;

Update: 2024-06-25 05:30 GMT

బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 8 ఎన్‌కౌంటర్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో (DLS ద్వారా) విజయాన్ని సాధించింది. లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీతో చివరి వరకు ప్రయత్నించినప్పటికీ, రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టడం ఆఫ్ఘనిస్తాన్‌కు కలిసి వచ్చింది. ఫలితంగా తక్కువ స్కోరును జాగ్రత్తగా కాపాడుకుంది. అంతకుముందు, కీలకమైన సూపర్ ఎయిట్ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్‌లను ఐదు వికెట్లకు 115 పరుగులకు పరిమితం చేసింది. ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్ రహ్మానుల్లా గుర్బాజ్ 55 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అయితే ప్లాట్‌ఫారమ్‌ను సద్వినియోగం చేసుకోవడంలో ఆఫ్ఘనిస్తాన్ విఫలమైంది.ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా రెండంకెల స్కోరు మాత్రమే చేయగలిగారు. రషీద్ ఖాన్ 3 వికెట్లు తియ్యటంతో ఆఫ్ఘన్‌ 115 పరుగులకే పరిమితం అయిపోయింది.

అయితే తరువాత బ్యాటింగ్ కి దిగిన బంగ్లాదేశ్ బ్యాటర్లను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కట్టడి చేశారు. లిట్టన్ దాస్ పట్టు బట్టి ఆడినా ఫలితం లేకపోయింది. మరోవైపు వర్షం ఆటంకం కలిగిస్తూనే ఉంది. వర్షం కారణంగానే మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించారు. అలాగే పరుగులు కూడా 114కు తగ్గించారు. అయినా నవీన్ ఉల్ హాక్, రషీద్ ఖాన్ లు చెరో నాలుగు వికెట్లు తియ్యడంతో బంగ్లాదేశ్ కుదేలైపోయింది డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags:    

Similar News