Roman Reigns-WWE: రోమన్ రేన్స్ భార్య ఈవిడే..!
WWE ఛాంపియన్‌షిప్‌ని ఎక్కువ రోజులు నిలుపుకున్న ఆటగాడిగా రేయిన్స్ నిలిచాడు.;
WWE తెలిసిన వాళ్లకి రోమన్ రేన్స్(Roman Reigns)అంటే ఎవరో తెలియకుండా ఉండదు. అక్కడ రింగ్‌లో జరిగే ఫైట్‌లకు చాలా క్రేజ్ ఉంటుంది. ప్రతిష్టాత్మకంగా భావించే WWE ఛాంపియన్‌షిప్‌ని 5 సార్లు గెలిచాడు. యూనివర్సల్ ఛాంపియన్‌షిప్‌ని 2 సార్లు సాధించాడు. రోమన్ రేన్స్ తన జులపాల జుట్టు, 6 అడుగుల ఎత్తు, భారీ దేహధారుడ్యంతో రింగ్‌లో చిరుతలాగా దూకుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే అతని అసలు పేరు లీటి జోసెఫ్.
రోమన్ 2007లో జార్జియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివే రోజుల్లో తను కాలేజీ సహచరి అయిన గాలిన బెకర్‌తో ప్రేమలో పడ్డారు. తొలి చూపులోనే ఒకరినకరం ఇష్టపడ్డామని వెల్లడించాడు. తర్వాత చాలా రోజులుగా డేటింగ్ అనతరం 7 సంవత్సరాల అనంతరం, 2014లో వివాహం చేసుకున్నారు.
గాలినా బెకర్ తనకు భార్య మాత్రమే కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని రోమన్ రేన్స్ తన భార్యపై ప్రేమ కురిపించాడు.
కాలేజీ బిజినెస్ మేనేజ్మెంట్ అభ్యసించిన వీరిద్దరూ మంచి అథ్లెట్లు కూడా. రోమన్ ఫుట్‌బాల్ ఆడుతుండగా, బెకర్‌కి ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో ప్రవేశం ఉంది. బెకర్ కాలిఫోర్నియా రాష్ట్రం తరపున లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, 100 మీటర్స్ రన్, 100 మీటర్స్ హర్డల్స్‌లో పలు పతకాలు సాధించింది. 2009లో చదువు అయిన అనంతరం బెకర్ ఫిట్‌నెస్ మోడల్‌గా పని చేసింది.
2014లో బహమాస్‌లోని ప్రైవేట్ దీవుల్లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు సంతానం కూడా ఉన్నారు. అందరికీ మొదటగా జోల్లీ వారు డేటింగ్‌లో ఉన్న 2007లోనే జన్మింనింది. వారి వివాహానికి కూతురు కూడా హాజరయింది. 2016లో వారికి మగ కవలలు పుట్టగా, 2020లో కూడా కవలలే జన్మించారు.
రోమన్ రేన్స్ 2 సార్లు క్యాన్సర్‌ని జయించాడు. 2007లో ల్యుకేమియా వచ్చి భాదపడుతున్నపుడు భార్య అతని పక్కనే ఉంది. అప్పుడు ఆమె గర్భిణీగా కూడా. 2018లో మళ్లీ దాని బారిన పడ్డాడు.
2020 సంవత్సరం మొదట్లో నుంచి తాత్కాలికంగా విరామం తీసుకున్నాడు. ఫ్యామిలీ, పిల్లలు పెరుగుతున్నారు. వారి కోసం సమయం కేటాయించడం వల్ల వారితో చాలా ఎక్కువ సమయం గడుపుతూ అనుబంధాన్ని పెంచుకుంటున్నాని వెల్లడించాడు.