ARREST: మరో క్రికెటర్‌పై రేప్ కేసు .. అరెస్ట్
బ్రిటన్‌లో పాక్ క్రికెటర్ అరెస్ట్;
పాకిస్తాన్ క్రికెట్ లో పెను సంచలనం చోటు చేసుకుంది. పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో... పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రిటన్‌కు సంబంధించిన ఓ మహిళ పట్ల... పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీ అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధిత మహిళ ఫిర్యాదు నేపథ్యంలో హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ వార్త బయటకు రావడంతో వెంటనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. అతనిపై సస్పెండ్ వేటు వేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. జరిగిన సంఘటనపై కూడా ఆరా తీస్తోంది. ఇక హైదర్ అలీ అరెస్టు సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు హైదర్ అలీ వయసు 24 సంవత్సరాలు. అతను 2020 సెప్టెంబర్ ఒకటో తేదీన అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. తొలి వన్డే జింబాబ్వే జట్టు పైన ఆడాడు.
సంచలనం..11 మంది రెజ్లర్లపై వేటు
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన 11 మంది రెజ్లర్లను..భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సస్పెండ్ చేసింది. రెజ్లింగ్ క్రీడకు హరియాణా ప్రసిద్ధి చెందినది. దాంతో ఆ రాష్ట్ర జట్టులో ఎంపికకు పోటీ తీవ్రంగా ఉండడంతో పలువురు ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈక్రమంలో వారు ఢిల్లీలో జన్మించినట్టు నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలు పొందుతున్నారు. వీటిపై అనుమానం వచ్చిన డబ్ల్యూఎ్‌ఫఐ విచారణ చేయాల్సిందిగా ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌ను కోరింది. దర్యాప్తు జరిపిన కార్పొరేషన్ 11 మంది రెజ్లర్ల జనన ధ్రువీకరణ పత్రాలు తాము జారీ చేయలేదని తేల్చింది. సాక్షమ్, మనుజ్, కవిత, అన్షు, ఆరుష్ రాణా, శుభమ్, గౌతమ్, జగ్రూప్ ధన్కడ్, నకుల్, దుష్యంత్, సిద్ధార్థ బలియాన్ అనే రెజ్లర్లపై డబ్ల్యూఎ్‌ఫఐ వేటు వేసింది.