ASHES: ఐదో టెస్టులో ఆస్ట్రేలియా విజయం

5 టెస్టుల సిరీస్‌ 4-1తో సొంతం... ఉస్మాన్ ఖవాజాకు ఘన వీడ్కోలు.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’గా హెడ్ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా స్టార్క్

Update: 2026-01-08 10:45 GMT

ప్ర­తి­ష్టా­త్మక యా­షె­స్‌ సి­రీ­స్‌­ను ఆస్ట్రే­లి­యా ఘనం­గా ము­గిం­చిం­ది. స్వ­దే­శం­లో జరి­గిన 2025-2026 ఐదు టె­స్టుల యా­షె­స్‌ సి­రీ­స్‌­ను ఆస్ట్రే­లి­యా 4-1 తే­డా­తో కై­వ­సం చే­సు­కుం­ది. సి­డ్నీ వే­ది­క­గా జరి­గిన చి­వ­రి మ్యా­చ్‌­లో 5 వి­కె­ట్ల తే­డా­తో  వి­జ­యం సా­ధిం­చిం­ది. ఈ మ్యా­చ్‌ ద్వా­రా ఇం­ట­ర్నే­ష­న­ల్‌ క్రి­కె­ట్‌­కు రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చిన ఉస్మా­న్‌ ఖవా­జా­కు సి­రీ­స్‌ వి­జ­యం­తో ఘన­మైన వీ­డ్కో­లు పలి­కిం­ది. కాగా, రోం­డో ఇన్నిం­గ్స్‌­లో 302/8తో ఐదో రోజు అటను కొ­న­సా­గిం­చిన ఇం­గ్లాం­డ్‌ 342 రన్స్‌­కు ఆలౌ­టైం­ది. దీం­తో ఇం­గ్లాం­డ్‌ ని­ర్దే­శిం­చిన 160 పరు­గుల లక్ష్యా­న్ని ఆసీ­స్‌ కే­వ­లం 5 వి­కె­ట్లు మా­త్ర­మే కో­ల్పో­యి వి­జ­యా­న్ని అం­దు­కుం­ది.

ఛే­ద­న­లో ఆస్ట్రే­లి­యా ఓపె­న­ర్లు ట్రా­వి­స్‌ హె­డ్‌(29), జా­క్‌ వె­ద­ర్‌­లాం­డ్‌(34) శు­భా­రం­భా­న్ని­చ్చా­రు. తద­త­నం­త­రం వచ్చిన బ్యా­ట­ర్లు లబు­షే­న్‌(37) మి­న­హా ఎవరు రా­ణిం­చ­లే­దు. కె­ప్టె­న్‌ స్టీ­వ్‌ స్మి­త్‌(12), కె­రీ­ర్‌­లో­నే చి­వ­రి మ్యా­చ్‌ ఆడు­తు­న్న ఉస్మా­న్‌ ఖవా­జా(6) ని­రా­శ­ప­రి­చా­రు. అలె­క్స్‌ కేరీ(16), కా­మె­రూ­న్‌ గ్రీ­న్‌(22) నా­టౌ­ట్‌­గా ని­లి­చి వి­జ­యా­న్ని అం­దిం­చా­రు. ఇం­గ్లాం­డ్‌ బౌ­ల­ర్ల­లో జో­ష్‌ టం­గ్‌(3/42) రా­ణిం­చా­డు. తొలి ఇన్నిం­గ్స్‌­లో ఇం­గ్లాం­డ్‌384, ఆసీ­స్‌ 567 రన్స్‌­కు అలౌ­ట­య్యా­యి. 302/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 88.2 ఓవర్లలో 342 పరుగులకు కుప్పకూలింది. ఓవర్‌నైట్ బ్యాటర్, సెంచరీ హీరో జాకోబ్ బెతెల్( 265 బంతుల్లో 15 ఫోర్లతో 154)‌ను మిచెల్ స్టార్క్ ఔట్ చేశాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు.

ఓవర్‌నైట్ స్కోర్‌కు అతను 12 పరుగులు మాత్రమే చేశాడు. జోష్ టంగ్(6) సాయంతో మాథ్యూ పోట్స్(18 నాటౌట్) కాసేపు పోరాడినా.. మిచెల్ స్టార్క్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరదించాడు. జోష్ టంగ్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్(3/72), బ్యూ వెబ్‌స్టార్(3/64)మూడేసి వికెట్లు తీయగా.. మైఖేల్ నేసర్ ఒక వికెట్ పడగొట్టాడు. స్కాట్ బోలాండ్‌ రెండు వికెట్లు తీసాడు.

సు­నా­యాస వి­జ­యం

183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో 160 పరుగుల లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా, వన్డే తరహా బ్యాటింగ్‌తో 31.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (29), జాక్ వెదరాల్డ్ (34), మార్నస్ లబుషేన్ (37) రాణించగా, ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ (3/42) మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 97.3 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (160) సెంచరీతో మెరిసినా, ఆసీస్ బౌలర్లలో మైఖేల్ నేసర్ (4/60), మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ కీలకంగా వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో చెలరేగగా, బ్యూ వెబ్‌స్టర్ (71 నాటౌట్) సహకరించాడు. సిరీస్‌లో 26 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలవగా, ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Tags:    

Similar News