Asia Cup : ఆసియా కప్ రద్దు..!
Asia Cup : శ్రీలంకలో జూన్ లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయింది.;
Asia Cup : శ్రీలంకలో జూన్ లో జరగాల్సిన ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ రద్దయింది. శ్రీలంకలో కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం అసాధ్యమని శ్రీలంక క్రికెట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే డిసిల్వా ప్రకటించారు. రానున్న రెండు సంవత్సరాలకు చాలా దేశాల క్రికెట్ బోర్డులు షెడ్యూల్స్ సిద్ధం చేసుకున్నందున.. 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత దీన్ని తదుపరి నిర్వహించాలని ఆయన అన్నారు. కాగా భారత్ లో కరోనా కారణంగా ఐపీఎల్ ఈ ఏడాది సీజన్ రద్దైన సంగతి తెలిసిందే.