ASIA CUP: రక్తం-క్రికెట్ కలిసి ఎలా సాగగలవ్ !

భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత... ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ డిమాండ్లు... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కొందరు ఫ్యాన్స్... రక్తం-నీరు కలిసి ప్రవహించబోవన్న మోదీ

Update: 2025-09-13 06:30 GMT

ఆసి­యా కప్ 2025లో భా­గం­గా భా­ర­త్, పా­కి­స్థా­న్ జట్ల మధ్య జర­గ­ను­న్న మ్యా­చ్‌­పై తీ­వ్ర వి­వా­దం చె­ల­రే­గిం­ది. ఉగ్ర­వా­దు­ల­కు ఆశ్ర­యం కల్పి­స్తు­న్న దే­శం­తో క్రి­కె­ట్ ఆడ­వ­ద్దం­టూ పలు­వు­రు అభ్యం­త­రం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ఆసి­యా కప్ 2025లో భా­గం­గా సె­ప్టెం­బ­ర్ 14న దు­బా­య్‌­లో భా­ర­త్-పా­కి­స్థా­న్ మ్యా­చ్‌ జర­గ­నుం­ది. షె­డ్యూ­ల్ ప్ర­క­టిం­చి­న­ప్ప­టి నుం­చి ఈ మ్యా­చ్ రద్దు చే­యా­లం­టూ కొం­ద­రు డి­మాం­డ్ చే­స్తూ­నే ఉన్నా­రు. దే­శం­లో­ని క్రి­కె­ట్ అభి­మా­ను­లు సైతం ఈ మ్యా­చ్ పై తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. జమ్మూ కశ్మీ­ర్‌­లో­ని పహ­ల్గా­మ్‌­లో జరి­గిన ఉగ్ర­వాద దా­డి­లో 26 మంది అమా­య­కు­లు అమ­రు­ల­య్యా­రు. అనం­త­రం భా­ర­త్ ఆప­రే­ష­న్ సిం­దూ­ర్‌­ను ప్రా­రం­భిం­చిం­ది.

 నెటిజన్ల ప్రశ్నలు

శత్రు­దే­శం పాక్ కా­ల్పు­ల్లో మన దే­శా­ని­కి చెం­ద­ని 20 మంది సై­ని­కు­లు ప్రా­ణా­లు కో­ల్పో­యా­రు. అమ­ర­వీ­రుల కు­టుం­బాల కళ్లు చె­మ్మ ఆర­లే­దు. అం­త­లో­నే శత్రు­వు­తో మ్యా­చ్ ఆడటం పట్ల ప్ర­జ­ల్లో ఆగ్ర­హం వ్య­క్తం కా­వ­డం సహజం. గతం­లో ఉగ్ర­వా­దం, వా­ణి­జ్యం కలి­సి సా­గ­లే­వ­ని, రక్తం, నీరు కలి­సి ప్ర­వ­హిం­చ­లే­వ­ని ప్ర­ధాన మం­త్రి మోడీ చె­ప్పిన మా­ట­ల­ను నె­టి­జ­న్లు ఇప్పు­డు గు­ర్తు చే­స్తు­న్నా­రు. ఆ మా­ట­లు ఏమ­య్యా­య­ని.. రక్తం, క్రి­కె­ట్ ఎలా కలి­సి సా­గ­గ­ల­వ­ని ప్ర­భు­త్వం, బీ­సీ­సీ­ఐ­ని సో­ష­ల్ మీ­డి­యా­లో ప్ర­శ్ని­స్తు­న్నా­రు. తాజా పరి­స్థి­తు­ల్లో సె­ప్టెం­బ­ర్ 14న దు­బా­య్‌­లో జర­గ­బో­యే భా­ర­త్ – పాక్ ఆసి­యా కప్ మ్యా­చ్‌­ను రద్దు చే­యా­ల­ని కో­రు­తూ సు­ప్రీం­కో­ర్టు­లో ప్ర­జా ప్ర­యో­జన వ్యా­జ్యం దా­ఖ­లైం­ది.

పంజాబ్ కింగ్స్ పోస్ట్

ఐపీఎ­ల్ ఫ్రాం­చై­జీ పం­జా­బ్ కిం­గ్స్ తన­దైన శై­లి­లో ని­ర­సన తె­లి­పి ఈ చర్చ­ను మరిం­త­గా వే­డె­క్కిం­చిం­ది. ఎల్లుం­డి జర­గ­ను­న్న ఈ హై-వో­ల్టే­జ్ మ్యా­చ్‌­కు సం­బం­ధిం­చి పం­జా­బ్ కిం­గ్స్ సో­ష­ల్ మీ­డి­యా­లో ఒక ఆస­క్తి­కర పో­స్ట్ పె­ట్టిం­ది. భారత తదు­ప­రి మ్యా­చ్ అంటూ షేర్ చే­సిన గ్రా­ఫి­క్‌­లో ప్ర­త్య­ర్థి జట్టు అయిన పా­కి­స్థా­న్ పే­రు­ను ఎక్క­డా ప్ర­స్తా­విం­చ­కుం­డా ఖా­ళీ­గా వది­లే­సిం­ది. ఈ పో­స్ట్ క్ష­ణా­ల్లో వై­ర­ల్ అవ్వ­డం­తో, నె­టి­జ­న్ల నుం­చి భారీ స్పం­దన వచ్చిం­ది. దీం­తో పం­జా­బ్ కిం­గ్స్ తమ ‘ఎక్స్’ ఖా­తా­లో కా­మెం­ట్స్ సె­క్ష­న్‌­ను ని­లి­పి­వే­యా­ల్సి వచ్చిం­ది. మరో­వై­పు, ఈ మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా రద్దు చే­యా­ల­ని కో­రు­తూ కొం­ద­రు సు­ప్రీం­కో­ర్టు­లో పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు. "దే­శాల మధ్య క్రి­కె­ట్ స్నే­హా­న్ని, సా­మ­ర­స్యా­న్ని పెం­చా­లి. కానీ పహ­ల్గా­మ్ ఉగ్ర­దా­డి, ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ లాం­టి ఘటనల తర్వాత మన సై­ని­కు­లు ప్రా­ణ­త్యా­గా­లు చే­స్తుం­టే, ఉగ్ర­వా­దు­ల­కు ఆశ్ర­య­మి­స్తు­న్న దే­శం­తో క్రీ­డల పే­రు­తో సం­బ­రా­లు చే­సు­కో­వ­డం సరి­కా­దు" అని పి­టి­ష­న­ర్లు తమ పి­టి­ష­న్‌­లో పే­ర్కొ­న్నా­రు.

ఐపీఎల్ ఛైర్మన్ కీలక ప్రకటన

భా­ర­త్-పాక్ మ్యా­చ్‌­పై ఐపీ­ఎ­ల్ ఛై­ర్మ­న్ అరు­ణ్ ధు­మా­ల్ ఓ కీలక ప్ర­క­టన చే­శా­రు. అరు­ణ్ ధు­మా­ల్ మా­ట్లా­డు­తూ.. " ఆసి­యా కప్ కోసం భారత జట్టు­కు నా శు­భా­కాం­క్ష­లు. ద్వై­పా­క్షిక మ్యా­చ్‌ల వి­ష­యం­లో పా­కి­స్తా­న్‌­తో ఆడ­బో­మ­ని ప్ర­భు­త్వం తమ వై­ఖ­రి­ని స్ప­ష్టం చే­సిం­ది. అయి­తే ఏసీ­సీ లేదా ఐసీ­సీ టో­ర్న­మెం­ట్లు ఉన్న­ప్పు­డు మనం వా­టి­లో పా­ల్గొ­నా­ల్సి ఉం­టుం­ది. అం­దు­కే మనం ప్ర­భు­త్వం సలహా మే­ర­కు నడు­చు­కుం­టాం" అని తె­లి­పా­రు.

Tags:    

Similar News