ASIA CUP: ఆసియా కప్‌ నుంచి భారత్ ఔట్?

పీసీబీ వైఖరితో బీసీసీఐ నిర్ణయం..?... భారత్ అడడంపై సందేహాలు.. ఆసియా కప్ నిర్వహణపైనే సందిగ్దం;

Update: 2025-07-21 06:30 GMT

ఈ ఏడా­ది జర­గ­బో­యే ఆసి­యా కప్‌­పై అని­శ్చి­తి నె­ల­కొం­ది. ఈ టో­ర్నీ నుం­చి వై­దొ­ల­గా­ల­ని బీ­సీ­సీఐ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్టు జా­తీయ మీ­డి­యా­లో కథ­నా­లు వస్తు­న్నా­యి. బో­ర్డు ఈ కీలక ని­ర్ణ­యం తీ­సు­కో­వ­డం వె­నుక బం­గ్లా­దే­శ్ రా­జ­ధా­ని ఢా­కా­లో ఆసి­యా క్రి­కె­ట్ కౌ­న్సి­ల్(ఏసీ­సీ) సర్వ­స­భ్య సమా­వే­శం ని­ర్వ­హి­స్తుం­డ­ట­మే కా­ర­ణ­మ­ని సదరు కథ­నా­లు పే­ర్కొ­న్నా­యి. బం­గ్లా­దే­శ్‌­తో సం­బం­ధా­లు అం­తంత మా­త్ర­మే ఉం­డ­టం­తో ఏసీ­సీ ఏజీ­ఎం­ను ఢా­కా­లో ని­ర్వ­హిం­చ­డా­న్ని బీ­సీ­సీఐ వ్య­తి­రే­కి­స్తుం­ది. ఆసి­యా కప్ ఆతి­థ్య హక్కు­లు భా­ర­త్‌ వద్దే ఉన్నా­యి. కానీ, తట­స్థ వే­ది­కై­నా యూ­ఏ­ఈ­లో టో­ర్నీ ని­ర్వ­హిం­చ­డా­ని­కి సన్నా­హా­లు జరు­గు­తు­న్నా­యి. షె­డ్యూ­ల్ ఇంకా ఖరా­రు కా­న­ప్ప­టి­కీ సె­ప్టెం­బ­ర్‌­లో టో­ర్నీ­ని ని­ర్వ­హిం­చేం­దు­కు ఏసీ­సీ ప్ర­య­త్ని­స్తోం­ది. అయి­తే, తాజా పరి­ణా­మాల నే­ప­థ్యం­లో ఆసి­యా కప్ జర­గ­డం­పై సం­ది­గ్ధం నె­ల­కొం­ది.

వివాదం ఏమిటి?

పీ­సీ­బీ ఛై­ర్మ­న్‌­గా మొ­హ­సి­న్ నఖ్వి ని­య­మి­తు­లైన తర్వాత, ఆయన గతం­లో బీ­సీ­సీ­ఐ­పై చే­సిన కొ­న్ని వ్యా­ఖ్య­లు, ము­ఖ్యం­గా భా­ర­త్‌­ను ఉద్దే­శిం­చి “టీ­మిం­డి­యా­ను అవ­మా­నిం­చిన” తీరు వి­వా­దా­స్ప­దం­గా మా­రా­యి. ఛాం­పి­య­న్స్ ట్రో­ఫీ వి­జ­యం­పై ట్వీ­ట్ చే­స్తూ, టో­ర్నీ వి­జేత అయిన భా­ర­త్‌­ను ప్ర­స్తా­విం­చ­కుం­డా మి­గ­తా వి­ష­యా­ల­న్నిం­టి­నీ నఖ్వి పే­ర్కొ­న­డం భారత అభి­మా­నుల ఆగ్ర­హా­ని­కి కా­ర­ణ­మైం­ది. ఇది ఇరు దే­శాల మధ్య క్రి­కె­ట్ సం­బం­ధా­ల­పై మరింత ప్ర­భా­వం చూ­పు­తోం­ది. . పీ­సీ­బీ ఛై­ర్మ­న్ మొ­హ­సి­న్ నఖ్వి తీ­సు­కు­న్న వై­ఖ­రి, ము­ఖ్యం­గా భా­ర­త్ – పా­కి­స్తా­న్ మధ్య క్రి­కె­ట్ సం­బం­ధా­ల­పై ఆయన చే­సిన వ్యా­ఖ్య­లు ఈ టో­ర్న­మెం­ట్ ని­ర్వ­హ­ణ­కు ఆటం­కం కలి­గిం­చే­లా ఉన్నా­యి.

వేదిక మార్చాలని డిమాండ్

ఈ నెల 24న ఢా­కా­లో ఏసీ­సీ వా­ర్షిక సర్వ­స­భ్య సమా­వే­శం ని­ర్వ­హిం­చ­ను­న్నా­రు. బం­గ్లా­తో సం­బం­ధా­లు అం­తంత మా­త్రం­గా­నే ఉం­డ­టం­తో ఏసీ­సీ మీ­టిం­గ్ వే­ది­క­ను మా­ర్చా­ల­ని బీ­సీ­సీఐ డి­మాం­డ్ చే­సి­న­ట్టు వా­ర్త­లు వస్తు­న్నా­యి. ఢా­కా­లో జరి­గి­తే ఏసీ­సీ మీ­టిం­గ్‌­కు హా­జ­రు­కా­మ­ని కూడా సమా­చా­రం ఇచ్చి­న­ట్టు తె­లు­స్తోం­ది. అం­తే­కా­కుం­డా, ఆ మీ­టిం­గ్‌­లో ఆమో­దిం­చిన ఏ తీ­ర్మా­నా­న్ని అయి­నా బహి­ష్క­రి­స్తా­మ­ని బీ­సీ­సీఐ వర్గా­లు తె­లి­పి­న­ట్టు సదరు కథ­నా­లు పే­ర్కొ­న్నా­యి. ఏసీ­సీ ప్రె­సి­డెం­ట్‌­గా జై షా రా­జీ­నా­మా చే­సిన తర్వాత పీ­సీ­బీ చై­ర్మ­న్ మొ­హ్సి­న్ నఖ్వీ ఏసీ­సీ పగ్గా­లు చే­ప­ట్టా­రు. ఏసీ­సీ మీ­టిం­గ్‌­కు హా­జ­రు కా­వా­ల­ని భా­ర­త్‌­పై మొ­హ్సి­న్ నఖ్వీ అన­వ­సర ఒత్తి­డి తె­స్తు­న్న­ట్టు బీ­సీ­సీఐ వర్గా­లు పే­ర్కొ­న్నా­యి. ఏసీ­సీ వే­ది­క­ను మా­ర్చా­ల­ని బీ­సీ­సీఐ కో­రి­నా అం­దు­కు నఖ్వీ నుం­చి ఎలాం­టి స్పం­దన రా­లే­ద­ని తె­లి­పా­యి.

Tags:    

Similar News