Paris Olympics 2024: మరో పతకం వేటలో మను, క్వార్టర్స్‌లోకి సాత్విక్-చిరాగ్

నేడు భారత్ క్రీడాకారులు షెడ్యూల్ ఇదే..;

Update: 2024-07-30 04:15 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో  షూటింగ్‌లో స్టార్ షూటర్ మను భాకర్ కాంస్యం సాధించి భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. ఇప్పుడు నాలుగో రోజు మను భాకర్ నుంచి మరోసారి కాంస్య పతకం ఆశిస్తున్నారు. ఆమె ఈరోజు (జూలై 30)10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక పోరులో మను భాకర్ పోటీపడనుంది. ఆమె భాగస్వామి సరబ్‌జోత్ సింగ్. దీంతో పాటు బ్యాడ్మింటన్ స్టార్ పెయిర్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి కూడా నేడు బరిలోకి దిగనున్నారు. నాలుగో రోజు భారత్ పూర్తి షెడ్యూల్  ఏంటంటే.. 

క్వార్టర్స్‌లోకి ప్రవేశించిన సాత్విక్-చిరాగ్..

బ్యాడ్మింటన్‌లో సోమవారం జరగాల్సిన సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ రద్దయింది. ప్రపంచ నంబర్-3 సాత్విక్-చిరాగ్ తమ రెండో గ్రూప్ గేమ్‌లో జర్మనీకి చెందిన మార్క్ లామ్స్‌ఫస్, మార్విన్ సీడెల్‌లను ఎదుర్కోవలసి వచ్చింది. కానీ లామ్స్‌ఫస్ మోకాలికి గాయం కావడంతో సీడెల్ ఉపసంహరించుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో చిరాగ్-సాత్విక్ జోడీ అడ్వాంటేజ్‌గా నిలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.

భారత్ క్రీడాకారులు షెడ్యూల్ ఇదే…

– 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ కాంస్య పతక మ్యాచ్: భారత్ (మను భాకర్, సరబ్జోత్ సింగ్) vs కొరియా – మధ్యాహ్నం 1.00

– ట్రాప్ పురుషుల అర్హత: పృథ్వీరాజ్ తొండైమాన్ – మధ్యాహ్నం 12.30

– ట్రాప్ మహిళల అర్హత: శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి – 12:30

హాకీ:

– పురుషుల పూల్ B మ్యాచ్: భారతదేశం vs ఐర్లాండ్ – 4:45 PM

విలువిద్య:

– మహిళల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: అంకితా భకత్ (సాయంత్రం 5:15) భజన్ కౌర్ (సాయంత్రం 5:30)

– పురుషుల వ్యక్తిగత 1/32 ఎలిమినేషన్ రౌండ్: ధీరజ్ బొమ్మదేవర (సాయంత్రం 10:45

బ్యాడ్మింటన్:

– పురుషుల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి & చిరాగ్ శెట్టి vs అల్ఫియన్ ఫజర్ & ముహమ్మద్ రియాన్ అర్డియాంటో (ఇండోనేషియా) సాయంత్రం 5:30 గంటలకు

– మహిళల డబుల్స్ (గ్రూప్ స్టేజ్): అశ్విని పొన్నప్ప & తనీషా క్రాస్టో vs సెట్యానా మపాసా & ఏంజెలా) – సాయంత్రం 6:20

బాక్సింగ్:

– పురుషుల 51 కేజీల రౌండ్ ఆఫ్ 16: అమిత్ పంఘల్ vs పాట్రిక్ చినియెంబా (జాంబియా) – 7:15 pm

– మహిళల 57 కేజీల రౌండ్ ఆఫ్ 32: జాస్మిన్ లంబోరియా vs నెస్టి పెటెసియో (ఫిలిప్పీన్స్) – రాత్రి 9:25

– 51 కేజీల ప్రీమియర్ రౌండ్ vs యెని మార్సెలా అరియాస్ (కొలంబియా) – ఉదయం 1:20 (జూలై 31)

Tags:    

Similar News