ఆసీస్‌పై బంగ్లాదేశ్ సంచలన విజయం.. సిరీస్ గెలుపే లక్ష్యంగా..
Australia vs Bangladesh: ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై సంచలన విజయం నమోదు చేసుకుంది.;
Australia vs Bangladesh: ఢాకా వేదికగా జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై సంచలన విజయం నమోదు చేసుకుంది. తొలి టీ20లో ఆసీస్ పై ఘనవిజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి టీ20 ఓటమి నుంచి తేరుకోకుండానే ఆసీస్‌ను రెండో టీ20 లో ఓడించి బంగ్లాదేశ్ సత్తా చాటింది. రెండో టీ20లో ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాదించింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బంగ్లా బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 45 పరుగులతో టాప్ స్కోరర్..హెన్రిక్స్ 30 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 3 వికెట్లు పడగొట్టగా.. షోరిఫుల్ ఇస్లామ్ 2, షకీబ్, మెహదీ హసన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
122 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు మహ్మద్ నయీమ్(9), సౌమ్యా సర్కార్‌లు(0)లు తక్కవ స్కోరుకే వెనుదిరిగారు.. షకీబ్ 26, మెహదీ హసన్ 23 పరుగులతో ఇన్నింగ్స్‌ను నిర్మించారు. చివర్లో అఫిఫ్ హొస్సేన్ 37(31బంతుల్లో) నాటౌట్, వికెట్ కీపర్ నూరుల్ హసన్ 22 నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌ను గెలిపించారు. రెండు జట్ల మధ్య మూడో టీ20 శుక్రవారం జరగనుంది.