ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ తన టెస్ట్ కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడబోతున్నాడు. జులై 6న లీడ్స్‌లో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ 3వ మ్యాచ్‌తో ఈ మార్క్ చేరుకోనున్నాడు. ఆస్ట్రేలియా తరఫున ఈ ఘనత సాధించనున్న 14వ ఆటగాడు స్మిత్.
స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 99 మ్యాచుల్లో 59.56 సగటు, 53.78 స్ట్రైక్‌రేట్‌తో 9113 పరుగులు సాధించాడు. ఇందులో 32 సెంచరీలు, 4 డబుల్ సెంచురీలు, 37 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి. టెస్టుల్లో స్మిత్ అత్యధిక స్కోర్ 239 పరుగులు. ఇది కూడా 2017-18 యాషెస్ సిరీస్‌లోనే సాధించాడు.
తన 100వ టెస్ట్‌పై స్టీవ్ స్మిత్ స్పందిస్తూ... ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి యాషెస్ సిరీస్ గెలవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానన్నాడు. నా 100వ టెస్ట్ మ్యాచ్‌లో సిరీస్‌ని గెలిస్తే అది తనకి చాలా సంతోషకరమైందన్నాడు.
100వ టెస్ట్ ఆడనున్న స్మిత్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించాడు. లెజెండరీ బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అంతటి బ్యాట్స్‌మెన్ స్టీవ్‌స్మిత్ అని ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.
3వ టెస్ట్ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాజర్ హుస్సేన్‌తో రికీ పాంటింగ్ ముచ్చటించాడు. స్టీవ్ స్మిత్ 100వ టెస్ట్ ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా నుంచి గొప్పఆటగాళ్లలో స్టీవ్‌స్మిత్ ఎన్నో స్థానంలో ఉంటాడు అని హుస్సేన్ అడగటంతో రికీ పాంటింగ్ స్పందించాడు.
"డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఆడే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అని వెల్లడించాడు. గణాంకాలు వేరుగా ఉండవచ్చు. కానీ స్మిత్ చాలా వేగంగా పరుగులు సాధిస్తూ రికార్డులు నమోదు చేస్తున్నాడు. లార్డ్స్ మ్యాచ్‌లో సెంచరీ చేసి అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు" అని బదులిచ్చాడు.