Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూత..!
Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ శుక్రవారం (మార్చి 4) గుండెపోటుతో మరణించాడు.;
Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ శుక్రవారం (మార్చి 4) గుండెపోటుతో మరణించాడు. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో షేన్ మరణించినట్లు అతని మేనేజర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం వార్న్ వయసు 52 సంవత్సరాలు.. వార్న్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. మొత్తం 145 టెస్టుల్లో 708 వికెట్లు తీశాడు.. ఇక 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. టెస్టులో 5 వికెట్లు 37 సార్లు, 10 వికెట్లు పదిసార్లు తీశాడు వార్న్. మొదటి ఐపీఎల్ కప్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టుకి వార్న్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
Shane Warne was a crowd puller. Magician with the ball. Absolute legend of Australian cricket. First IPL winning captain. He will be missed, He will be remembered forever. #rip #shanewarne
— Irfan Pathan (@IrfanPathan) March 4, 2022