హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ ముగిసింది. మంగళవారం దాదాపు 10 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు. హెచ్‌సీఏలో రూ.3.8 కోట్ల మేర అక్రమాలపై ఆయన్ను ప్రశ్నించినట్లు సమాచారం. క్రికెట్ పరికరాలు, నిధుల దుర్వినియోగంపై విచారించినట్లు తెలిసింది. హెచ్‌సీఏలో జరిగిన ఆర్థిక అవకతవకల వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి సంబంధించి జనరేటర్లు, అగ్నిమాపక వాహనాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అజహర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించగా.. మంగళవారం హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయానికి వెళ్లారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ హెచ్‌సీఏ కేసులో ఈడీ విచారణకు పిలిచింది. ఈడీ అధికారులకు సహకరించాను. నాపై పెట్టిన కేసులన్నీ అక్రమ కేసులే. కుట్రపూరితంగా నాపై అక్రమ కేసులు పెట్టారు’ అని తెలిపారు.