టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ అద్భుతం చేసింది. పాకిస్థాన్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసి రికార్డ్ నెలకొల్పింది. పాక్‌పై బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి. రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 185 రన్స్ టార్గెట్ తో సెకండ్ ఇన్నింగ్స్ ఓవర్ నైట్ స్కోరు 42/0తో మంగళవారం, ఐదో రోజు ఆటను ప్రారంభించిన బంగ్లాదేశ్ 56 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ని అందుకుంది. ఓపెనర్లు జకీర్ హసన్ 40 రన్స్, షాద్మాన్ ఇస్లామ్ 24 రన్స్, నజ్ముల్ హుస్సేన్ శాంటో 38 రన్స్, మోమినుల్ హక్ 34 రన్స్, ముష్పీకర్ రహీమ్ 22 రన్స్, షకీబుల్ హాసన్ 21 రన్స్ చేశారు.పాక్ బౌలర్లలో మీర్ హంజా, షాజాద్, అబ్రార్ అహ్మద్, ఆఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు.
ఫస్ట్ ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 274 రన్స్ కు ఆలౌటైంది.బంగ్లాదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 26 రన్స్ కే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా.. లిటన్ దాస్ 138 రన్స్, మెహదీ హసన్ 78 రన్స్ చేసి ఆదుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ 262 రన్స్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ 172కే ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 185 రన్స్ టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.