వెస్టిండీస్ పర్యటనకు భారత జట్లు ప్రకటన.. యశస్వి జైశ్వాల్‌కి పిలుపు

Update: 2023-06-24 00:55 GMT

వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత క్రికెట్ టెస్ట్, ODI జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శుక్రవారం ప్రకటించింది. అయితే T20 జట్టును తర్వాత ప్రకటిస్తామని వెల్లడించింది.

వన్డే ఓవర్ల క్రికెట్‌లో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‌గా పదోన్నతి పొందగా, చాలా రోజుల తర్వాత టీంలోకి వచ్చిన వెటరన్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. టెస్ట్ టీంలోకి కొత్తగా యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్‌ కుమార్‌లకు పిలుపువచ్చింది.

అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్న వరల్డ్‌ కప్‌ జట్టు ఎంపికకు ఈ సిరీస్‌లో ఆటగాళ్ల ప్రదర్శన కీలకం కానుంది.




ఈ పర్యటనలో భాగంగా భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20 లు ఆడనుంది.

2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ఈ పర్యటన ప్రారంభమవనుంది. మొదటి టెస్ట్‌ డొమినికాలోని విండ్సర్ పార్క్ స్పోర్ట్స్ స్టేడియంలో జూలై 12 నుండి 16 వరకు జరగనుండగా, రెండో టెస్టు మ్యాచ్ జూన్ 20 నుంచి జూన్ 24 వరకు ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరగనుంది. అనంతరం టెస్ట్ సిరీస్ తర్వాత వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడనుంది.

మొదటి వన్డే జులై 27న బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో, రెండో వన్డే జూలై 29న అదే వేదికగా జరగనుంది. చివరి మ్యాచ్ ఆగస్టు 1న బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ వేదిక కానుంది.

వన్డే సిరీస్ తర్వాత 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇరు జట్లు తలపడనున్నాయి. మొదటి మ్యాచ్ ఆగస్టు 3న ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో నిర్వహించనుండగా, రెండు, మూడో T20 లు ఆగస్టు 6, 8న గయానాలోని గయానా నేషనల్ స్టేడియంలో జరగనున్నాయి. నాలుగో, ఐదో టీ20 మ్యాచ్‌లు ఆగస్టు 12, 13 తేదీల్లో ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.

భారత జట్లు ఇవే...

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్, ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్, ముఖేష్ కుమార్.



Tags:    

Similar News