BCCI: డ్రీమ్ 11తో బీసీసీఐ తెగతెంపులు

358 కోట్ల రూపాయల కాంట్రాక్టు రద్దు !... స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకున్న డ్రీమ్ 11... అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ చట్టం;

Update: 2025-08-26 06:00 GMT

భారత క్రి­కె­ట్ జట్టు­కు ఊహిం­చ­ని ఎదు­రు­దె­బ్బ తగి­లిం­ది. ప్ర­ముఖ ఫ్యాం­ట­సీ గే­మిం­గ్ ప్లా­ట్‌­ఫా­మ్ డ్రీ­మ్ 11, టీ­మిం­డి­యా ప్ర­ధాన స్పా­న్స­ర్‌­షి­ప్‌ ఒప్పం­దం నుం­చి అర్ధాం­త­రం­గా వై­దొ­లి­గిం­ది. రూ. 358 కో­ట్ల భారీ ఒప్పం­దా­న్ని మధ్య­లో­నే రద్దు చే­సు­కు­న్న­ప్ప­టి­కీ, బీ­సీ­సీ­ఐ­కి ఎలాం­టి జరి­మా­నా చె­ల్లిం­చా­ల్సిన అవ­స­రం లే­క­పో­వ­డం గమ­నా­ర్హం. దే­శం­లో కొ­త్త­గా అమ­ల్లో­కి వచ్చిన ఆన్‌­లై­న్ గే­మిం­గ్ చట్ట­మే ఈ అనూ­హ్య పరి­ణా­మా­ల­కు దా­రి­తీ­సిం­ది. డ్రీ­మ్ ఎలె­వె­న్‌­తో సం­బం­ధా­ల­ను తెం­చు­కు­న్న తర్వాత, బీ­సీ­సీఐ కూడా ఓ కీలక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. బీ­సీ­సీఐ కా­ర్య­ద­ర్శి దే­వ్‌­జి­త్ సై­కి­యా మా­ట్లా­డు­తూ, ఇకపై అలాం­టి కం­పె­నీ­ల­తో తాము ఎటు­వం­టి ఒప్పం­దా­లు చే­సు­కో­మ­ని అన్నా­రు. డ్రీ­మ్ ఎలె­వ­న్‌­తో సం­బం­ధా­ల­ను తెం­చు­కు­న్న తర్వాత, బీ­సీ­సీఐ కా­ర్య­ద­ర్శి దే­వ్‌­జి­త్ సై­కి­యా మా­ట్లా­డు­తూ, ‘భవి­ష్య­త్తు­లో మేం ఇలాం­టి కం­పె­నీ­ల­తో పని చేయం’ అని అన్నా­రు.

డ్రీమ్ 11 కీలక నిర్ణయం..

డ్రీ­మ్11, భారత క్రి­కె­ట్ ని­యం­త్రణ మం­డ­లి 2023 సం­వ­త్స­రం­లో అను­బం­ధిం­చ­బ­డ్డా­యి. రెం­డిం­టి మధ్య ఒప్పం­దం 2026 సం­వ­త్స­రం వరకు ఉంది. డ్రీ­మ్11 2026 నా­టి­కి బీ­సీ­సీ­ఐ­కి రూ.358 కో­ట్లు చె­ల్లిం­చా­ల్సి వచ్చిం­ది. కానీ ఇప్పు­డు ఈ ఒప్పం­దం మధ్య­లో వి­చ్ఛి­న్న­మైం­ది. దీని కా­ర­ణం­గా బీ­సీ­సీఐ కూడా భా­రీ­గా నష్ట­పో­యిం­ది. ఆసి­యా కప్‌­న­కు ముం­దు BCCI­తో ఏ కం­పె­నీ చే­తు­లు కలు­పు­తుం­దో చూ­డ­టం ఆస­క్తి­క­రం­గా ఉం­టుం­ది. బీ­సీ­సీ­ఐ­కి My11Circle­తో కూడా సం­బం­ధం ఉంది. ఈ కం­పె­నీ IPL­లో ఫాం­ట­సీ భా­గ­స్వా­మి. ఈ కం­పె­నీ ఒక సం­వ­త్స­రం­లో బీ­సీ­సీ­ఐ­కి భారీ మొ­త్తా­న్ని కూడా చె­ల్లి­స్తుం­ది. ని­వే­ది­కల ప్ర­కా­రం, My11Circle BCCI­కి ఏటా రూ.125 కో­ట్లు చె­ల్లి­స్తుం­ది.

 జరిమానా లేకుండానే..

ఒక­వేళ ఏదై­నా కొ­త్త చట్టం వల్ల కం­పె­నీ ప్ర­ధాన వ్యా­పా­రా­ని­కి ఆటం­కం కలి­గి­తే, ఎలాం­టి జరి­మా­నా లే­కుం­డా స్పా­న్స­ర్‌­షి­ప్‌ నుం­చి వై­దొ­ల­గేం­దు­కు డ్రీ­మ్ 11కు వె­సు­లు­బా­టు ఉంది. ఈ క్లా­జ్ కా­ర­ణం­గా­నే, ఒప్పం­దా­న్ని ముం­దు­గా రద్దు చే­సి­నం­దు­కు బీ­సీ­సీ­ఐ­కి వారు ఎలాం­టి నష్ట­ప­రి­హా­రం చె­ల్లిం­చా­ల్సిన అవ­స­రం లేదు. 2023లో బై­జూ­స్ స్థా­నం­లో డ్రీ­మ్ 11 భారత జట్టు ప్ర­ధాన స్పా­న్స­ర్‌­గా బా­ధ్య­త­లు చే­ప­ట్టిం­ది. ఈ తాజా పరి­ణా­మం కే­వ­లం బీ­సీ­సీ­ఐ­పై­నే కా­కుం­డా, క్రి­కె­ట్ ప్ర­పం­చం­పై కూడా ప్ర­భా­వం చూ­ప­నుం­ది. డ్రీ­మ్ 11 ఐపీ­ఎ­ల్‌­లో­ని పలు ఫ్రాం­చై­జీ­ల­తో పాటు, మహేం­ద్ర సిం­గ్ ధోనీ, రో­హి­త్ శర్మ, హా­ర్ది­క్ పాం­డ్య, రి­ష­బ్ పంత్, జస్ప్రీ­త్ బు­మ్రా వంటి అనేక మంది స్టా­ర్ క్రి­కె­ట­ర్ల­కు బ్రాం­డ్ అం­బా­సి­డ­ర్‌­గా వ్య­వ­హ­రి­స్తోం­ది. దే­శం­లో అమ­ల్లో­కి వచ్చిన ఆన్‌­లై­న్ గే­మిం­గ్ చట్టం డ్రీ­మ్ 11 వ్యా­పా­రా­ని­కి గట్టి దె­బ్బ కొ­ట్టిం­ది. ఫలి­తం­గా సం­స్థ తన సే­వ­ల­లో చాలా వరకు ని­లి­పి­వే­యా­ల్సి వచ్చిం­ది. దీ­ని­వ­ల్ల సహ­జం­గా­నే స్పా­న్స­ర్‌­షి­ప్ ఒప్పం­దా­ల­ను కూడా ము­గిం­చక తప్ప­లే­దు. పా­ర్ల­మెం­ట్ ఇటీ­వ­లే ఆన్‌­లై­న్ గే­మిం­గ్ ని­యం­త్రణ బి­ల్లు, 2025 ను ఆమో­దిం­చిం­ది. దీని ద్వా­రా రి­య­ల్ మనీ గే­మిం­గ్ ప్లా­ట్ ఫా­రా­లు బ్యా­న్ అవు­తా­యి. డ్రీ­మ్ 11 వంటి చాలా యా­ప్స్, కం­పె­నీ­ల­పై ని­షే­ధం అమ­ల్లో­కి వస్తుం­ది. ఎం­ఎ­స్ ధోనీ, రో­హి­త్ శర్మ, హా­ర్ది­క్ పాం­డ్యా, రి­ష­బ్ పంత్, జస్ప్రి­త్ బు­మ్రా వంటి ప్ర­ముఖ క్రి­కె­ట­ర్లు ఈ సం­స్థ బ్రాం­డ్ అం­బా­సి­డ­ర్లు­గా ఉన్నా­రు.

Tags:    

Similar News