BCCI: కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న బీసీసీఐ
ఆటగాళ్ల స్వేచ్ఛకు కత్తెర... సిరీస్ జరుగుతుండగా ఇక నో ఎండార్స్‌మెంట్లు;
ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్‌లో టీమ్ ఇండియా ఘోర ఓటమి అనంతరం ప్లేయర్లకు స్వేచ్ఛ ఎక్కువ వడంతోనే ఫామ్ కోల్పోతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో టీమ్ ఇండియా ఆటగాళ్లపై BCCI ఆంక్షలు విధించింది. సిరీస్‌లు జరుగుతుండగా ప్లేయర్లు ఎలాంటి షూటింగ్‌లు, ఎండార్స్‌మెంట్లలో పాల్గొనకుండా నిషేధం విధించింది. సిరీస్ టూర్లకు వెళ్లినప్పుడు ఫ్యామిలీతో ఎక్కువ సమయం వారితో ఉండకుండా ఆంక్షలు విధించేందుకు BCCI సిద్ధమైంది.
బీసీసీఐ నిర్ణయానికి ఆకాశ్ చోప్రా మద్దతు
టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులు నిరంతరం వెంట ఉండటంపై బీసీసీఐ ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సమర్థించాడు. సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, అనిల్ కుంబ్లే ఇలా ప్రతి ఒక్కరికీ వివాహమైందని.. కానీ కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను షేర్ చేసుకొనేవాళ్లన్నారు. బీసీసీఐ నిర్ణయంతో ఈ తరం క్రికెటర్లలోనూ తమ సహచరులతో అనుబంధం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మళ్లీ అమలులోకి యో యో టెస్ట్?
టీమిండియా వరుస ఓటముల తరువాత బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా కొనసాగిన సమయంలో అమలులో ఉన్న పాత ఫిట్‌నెస్ టెస్ట్ రూల్స్‌ను తిరిగి ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా యో-యో ఫిట్‌నెస్ టెస్ట్‌ను మళ్లీ తీసుకురావాలని ఆలోచనలు చేస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఇటు ఆటగాళ్లు అందరూ తప్పనిసరిగా దేశవాళీలో ఆడాల్సిందేనని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసింది.
దేశవాళీ క్రికెట్ ఆడాలి: యువరాజ్
టీమిండియా ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక సూచనలు చేశారు. ఫామ్‌లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్నారు. ప్రాక్టీస్‌కు ఇద్దే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. అలాగే, హెడ్ కోచ్ గంభీర్ ఇప్పుడే వచ్చాడని.. అతనికి మరింత సమయం కావాలనిని చెప్పారు. రోహిత్ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను సాధించాడని, వన్డేల్లో ఫైనల్ వరకు తీసుకువెళ్లగలిగాడని తెలిపారు.