Sania Mirza: సానియా మీర్జా షాకింగ్ డెసిషన్..

Sania Mirza: దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పనుంది.;

Update: 2023-01-07 06:32 GMT

Sania Mirza: దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్ తర్వాత భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పనుంది. వచ్చే నెలలో దుబాయ్ డ్యూటీ ఛాంపియన్‌షిప్ టోర్నీ జరగనుంది. వాస్తవానికి సానియా మీర్జా గత సంవత్సరం US ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే గాయం కారణంగా ఆమె టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది. ఆ తర్వాత ఆమె రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకుంది.


భారత ఏస్‌ ప్లేయర్‌ తన ప్రొఫెషనల్ కెరీర్‌లో 6 మేజర్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.3 సార్లు డబుల్స్, 3 సార్లు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ నెలలో సానియా మీర్జా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన డబుల్స్‌ పార్టనర్‌ కజకిస్థాన్ కి చెందిన అన్నా డానిలియాతో కలిసి ఆడనుంది.


ఇక సానియా గత పదేళ్లుగా దుబాయ్‌లో ఉంటుంది. అయితే ఇటీవల తలెత్తిన స్వల్ప ఇబ్బందుల కారణంగా టెన్నిస్‌కు వీడ్కోలు పలకడం లేదని.. కేవలం తన ఆట విషయంలో తనకున్న లక్ష్యాలను అధిగమించడం కారణంగానే వైదొలగుతున్నట్లుగా ఓ ఇంటర్వూలో తెలిపింది. 36 ఏళ్ల టెన్నిస్ స్టార్ పాక్ క్రికెటర్ మాలిక్‌ని 2010లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన కొడుకుతో దుబాయ్‌లో ఉంటోంది. అక్కడే టెన్నిస్ అకాడమీని నడుపుతోంది సానియా.

Tags:    

Similar News