గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమితో బాధలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు బిగ్ షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రూ.12 లక్షల ఫైన్ విధించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయనందుకు ఆయనకు ఈ ఫైన్ పడింది.
ఐపీఎల్-2024లో జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరినామా విధిస్తున్నాం అంటూ ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షలు ఫైన్ వేశారు. మరోసారి ఇదే తప్పు జరిగితే భారీ ఫైన్ విధించే ఛాన్స్ ఉంది. ఇది మొదటి తప్పిదం కావున ఈ మొత్తంతో సరిపెడుతున్నట్లు వెల్లడించింది.
కాగా ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఒకసారి(రూ. 12 లక్షలు), ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ రెండుసార్లు(24 లక్షలు, తుదిజట్టులోని ఆటగాళ్ల ఫీజులో 25 శాతం/ఆరు లక్షలు) జరిమానా బారిన పడ్డారు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ఏడు వికెట్లు నష్టపోయి ఛేదించింది