స్పెయిన్ కు చెందిన టెన్నిస్ టాప్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్‌కు యూఎస్ ఓపెన్‌లో ఓటమి ఎదురైంది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ సాధించిన యూఎస్ ఓపెన్ నుంచి ఔటయ్యాడు. రెండో రౌండ్‌లో నెదర్లాండ్స్ టెన్నిస్ ప్లేయర్ బోటిక్ వాన్‌డి చేతిలో అల్కరాజ్ ఓడిపోయాడు. ప్రపంచ నంబర్ 74వ ర్యాంకర్ అయిన బోటిక్ 6-1, 7-5, 6-4 వరుస సెట్లతో వరల్డ్ థర్డ్ ర్యాంకర్ అయిన అల్కరాజ్‌ను ఓడించాడు. దాదాపు 2 గంటల 19 నిమిషాల్లోనే బోటిక్ విజయం సాధించాడు. దీంతో ఒకే సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్ విజేతగా నిలిచే అవకాశాన్ని అల్కరాజ్ కోల్పోయాడు. మహిళా టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకాకు ఓటమి తప్పలేదు. రెండుసార్లు ఛాంపియన్ అయిన ఒసాకాను చెక్ రిపబ్లిక్‌కు చెందిన కరోలినా ముచోవ 6-3, 7-6 తేడాతో ఒసాకాపై విజయం సాధించింది.