ఇంగ్లండ్ క్రికెట్ లెజెండ్ జెఫ్రీ బాయ్‌కాట్(83) మళ్లీ ఆసుపత్రిలో చేరారు. న్యుమోనియా కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. న్యుమోనియా పెరగడంతో ఆయన ఆహారం తీసులేకపోతున్నారని, ప్రస్తుతం వెంటిలేషన్ మీద ఉన్నారని ఆయన కూతురు ఎమ్మా వెల్లడించారు. 83 ఏళ్ల బాయ్‌కాట్ తొలిసారి 2002లో క్యాన్సర్ బారిన పడ్డారు. చాలా రోజులు పోరాడి కోలుకున్నారు. కీమో థెరఫీ చేయించుకున్నాడు. ఈ ఏడాది మే నెలలో క్యాన్సర్ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స తప్పలేదు. ఈ క్రమంలో మళ్లీ అతడి ఆరోగ్యం విషమించింది.