కేకేఆర్‌తో క్వాలిఫైయర్ మ్యాచులో ఓటమిని వీలైనంత త్వరగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తామని సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ అన్నారు. క్వాలిఫయర్-2 మ్యాచ్ జరిగే చెన్నై వికెట్ తమకు సరిగ్గా సరిపోతుందని.. అక్కడ గెలుస్తామనే నమ్మకముందన్నారు. ‘కేకేఆర్ అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బ్యాటింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌ను ఉపయోగించాలని నిర్ణయించి సన్వీర్‌కు ఛాన్సిచ్చాం. మా ప్లాన్ బెడిసికొట్టింది’ అని పేర్కొన్నారు.
ఐపీఎల్-2024లో ఫైనల్ చేరిన తొలి జట్టుగా కోల్‌కతా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో హైదరాబాద్ క్వాలిఫయర్2లో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 159 రన్స్ చేయగా.. కోల్‌కతా 13.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కోల్‌కతాలో వెంకటేశ్ అయ్యర్ 51, శ్రేయస్ 58 హాఫ్ సెంచరీలతో రాణించారు. హైదరాబాద్ ఫీల్డర్లు కీలక క్యాచ్‌లు నేలపాలు చేశారు.