CWG2030: అహ్మదాబాద్‌లో 2030 కామన్వెల్త్ గేమ్స్‌!

2030 కామన్వెల్త్ బిడ్‌కు భారత్ గ్రీన్ సిగ్నల్... ఆమోదముద్ర వేసిన కేంద్ర మంత్రివర్గం... బిడ్‌ ప్రతిపాదనకు అంగీకరించిన కేబినెట్;

Update: 2025-08-28 05:30 GMT

భా­ర­త­దే­శం మరో­సా­రి అం­త­ర్జా­తీయ క్రీ­డా వే­ది­క­గా ని­ల­వ­బో­తోం­ది. 2030 కా­మ­న్వె­ల్త్ గే­మ్స్‌­ను ని­ర్వ­హిం­చేం­దు­కు హో­స్ట్ చే­య­డా­ని­కి భా­ర­త్ సి­ద్ధ­మ­వు­తోం­ది. ఈ మే­ర­కు ప్ర­ధా­న­మం­త్రి నరేం­ద్ర మోదీ నే­తృ­త్వం­లో జరి­గిన యూ­ని­య­న్ కే­బి­నె­ట్ మీ­టిం­గ్‌­లో బిడ్ వేసే ప్ర­తి­పా­ద­న­కు గ్రీ­న్ సి­గ్న­ల్ ఇచ్చా­రు. బిడ్ గె­లి­స్తే అహ్మ­దా­బా­ద్‌­లో ఈ గ్రాం­డ్ ఈవెం­ట్ జర­గ­నుం­ది. అది కూడా గు­జ­రా­త్ సర్కా­ర్‌­కి గ్రాం­ట్ ఇన్ ఎయి­డ్‌­తో సహా అన్ని సపో­ర్ట్‌­ల­తో జర­గ­నుం­ది. ఒక­వేళ మన బిడ్ గె­లి­స్తే, హో­స్ట్ కొ­లా­బ­రే­ష­న్ అగ్రి­మెం­ట్ (HCA) కూడా సైన్ అవు­తుం­ది. బిడ్ ఆమో­దం పొం­ది­తే, గు­జ­రా­త్ ప్ర­భు­త్వా­ని­కి సహ­కార ఒప్పం­దం, గ్రాం­ట్–ఇన్–ఎయి­డ్ మం­జూ­రు చే­య­డా­ని­కి కూడా మం­త్రి­వ­ర్గం ఆమో­దం తె­లి­పిం­ది. కా­మ­న్వె­ల్త్ క్రీ­డ­ల్లో 72 దే­శాల నుం­చి అథ్లె­ట్లు పా­ల్గొ­న­ను­న్నా­రు. ఈ క్రీ­డల సమ­యం­లో దే­శా­న్ని పె­ద్ద సం­ఖ్య­లో అథ్లె­ట్లు, కో­చ్‌­లు, సాం­కే­తిక అధి­కా­రు­లు, పర్యా­ట­కు­లు, మీ­డి­యా వ్య­క్తు­లు సం­ద­ర్శిం­చ­ను­న్నా­రు. దీం­తో స్థా­నిక వ్యా­పా­రా­ల­కు ప్ర­యో­జ­నం చే­కూ­ర­డం­తో పాటు ఆదా­యం కూడా లభిం­చ­నుం­ది.

అహ్మదాబాద్ ఎందుకు?

అహ్మ­దా­బా­ద్‎­లో వర­ల్డ్ క్లా­స్ స్టే­డి­యం­లు, అత్యా­ధు­నిక ట్రై­నిం­గ్ ఫె­సి­లి­టీ­స్, స్పో­ర్ట్స్ పట్ల ఉన్న ప్యా­ష­న్ సహా అనే­కం ఉన్నా­యి. నరేం­ద్ర మోదీ స్టే­డి­యం కూడా ఇక్క­డే ఉంది. ఇది ప్ర­పం­చం­లో­నే అతి­పె­ద్ద స్టే­డి­యం. 2023లో ఐసీ­సీ క్రి­కె­ట్ వర­ల్డ్ కప్ ఫై­న­ల్‌­ని సక్సె­స్‌­ఫు­ల్‌­గా హో­స్ట్ చే­సిన ఈ స్టే­డి­యం, కా­మ­న్వె­ల్త్ గే­మ్స్ 2030కి కూడా రె­డీ­గా ఉంది. ఇక్కడ అథ్లె­ట్లు, కో­చ్‌­లు, టె­క్ని­క­ల్ ఆఫీ­స­ర్లు, టూ­రి­స్టు­లు, మీ­డి­యా పర్స­న్స్ సహా అం­ద­రూ ఒక చోట అం­దు­బా­టు­లో ఉం­టా­రు.

"భా­ర­త­దే­శం­లో కా­మ­న్‌­వె­ల్త్ గే­మ్స్‌­ని ని­ర్వ­హిం­చ­డం పర్యా­ట­కా­న్ని పెం­చ­డం­తో పాటు ఉద్యో­గా­ల­ను సృ­ష్టిం­చ­డం, లక్ష­లా­ది మంది యువ అథ్లె­ట్ల­కు స్ఫూ­ర్తి­ని­చ్చే శా­శ్వత ప్ర­భా­వా­న్ని చూ­పు­తుం­ది. అం­తే­కా­కుం­డా స్పో­ర్ట్స్ సై­న్స్, ఈవెం­ట్ ఆప­రే­ష­న్స్, మే­నే­జ్‌­మెం­ట్, లా­జి­స్టి­క్స్, ట్రా­న్స్‌­పో­ర్ట్ కో­ఆ­ర్డి­నే­ట­ర్లు, బ్రా­డ్‌­కా­స్ట్, మీ­డి­యా, IT, కమ్యూ­ని­కే­ష­న్స్, పబ్లి­క్ రి­లే­ష­న్స్, ఇతర రం­గా­ల­లో కూడా పె­ద్ద సం­ఖ్య­లో ని­పు­ణు­లు అవ­కా­శా­ల­ను పొం­దు­తా­రు” అని కేం­ద్ర మం­త్రి­వ­ర్గం తె­లి­పిం­ది. ఇం­డి­యా­తో పాటు, నై­జీ­రి­యా, మరో రెం­డు దే­శా­లు కూడా 2030లో బహుళ-క్రీ­డా మహో­త్స­వా­న్ని ని­ర్వ­హిం­చ­డా­ని­కి ఆస­క్తి­ని వ్య­క్తం చే­స్తు­న్న­ట్లు సమా­చా­రం. 2030 కా­మ­న్వె­ల్త్ క్రీ­డ­ల­కు తుది ఆతి­థ్య దే­శా­న్ని నవం­బ­ర్ చి­వ­రి వా­రం­లో గ్లా­స్గో­లో జరి­గే కా­మ­న్వె­ల్త్ స్పో­ర్ట్ జన­ర­ల్ అసెం­బ్లీ ని­ర్ణ­యి­స్తుం­ది.

72 దేశాల నుంచి అథ్లెట్లు..

ఈ కా­మ­న్వె­ల్త్ గే­మ్స్‌­లో 72 దే­శాల నుం­చి అథ్లె­ట్లు పా­ల్గొం­టా­రు. ఇది కే­వ­లం స్పో­ర్ట్స్ ఈవెం­ట్ మా­త్ర­మే కాదు, ఒక గ్లో­బ­ల్ సె­ల­బ్రే­ష­న్ అని కూడా చె­ప్ప­వ­చ్చు. ఈ ఈవెం­ట్ వల్ల లో­క­ల్ వ్యా­పా­రా­ల­కు కూడా మేలు జరు­గు­తుం­ది. హో­ట­ల్స్, రె­స్టా­రెం­ట్లు, టూ­రి­జం... అన్నీ బూ­స్ట్ అవు­తా­యి. అం­తే­కా­దు, ఈ ఈవెం­ట్ వల్ల ఉద్యోగ అవ­కా­శా­లు కూడా పె­రు­గు­తా­యి. స్పో­ర్ట్స్, సై­న్స్, ఈవెం­ట్ మే­నే­జ్‌­మెం­ట్, లా­జి­స్టి­క్స్, బ్రా­డ్‌­కా­స్ట్, మీ­డి­యా, IT, కమ్యూ­ని­కే­ష­న్స్... ఇలా ఎన్నో రం­గా­ల్లో యు­వ­త­కు అవ­కా­శా­లు దొ­రు­కు­తా­యి. ఈ మెగా ఈవెం­ట్ ఉద్యోగ అవ­కా­శా­ల­ను సృ­ష్టిం­చి, పర్యా­ట­కా­న్ని పెం­చు­తుం­ద­ని, పె­ద్ద ఎత్తున జరి­గే క్రీ­డా ఈవెం­ట్‌­ల­కు సం­బం­ధిం­చిన రం­గా­ల­లో ని­పు­ణుల వృ­ద్ధి­కి తో­డ్ప­డు­తుం­ద­ని తె­లి­పా­రు. కా­మ­న్వె­ల్త్ గే­మ్స్ వి­జ­య­వం­తం­గా ని­ర్వ­హిం­చి ఒలిం­పి­క్స్ కూడా ని­ర్వ­హిం­చా­ల­ని కేం­ద్రం భా­వి­స్తోం­ది.

Tags:    

Similar News