అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్లో పాల్గొనకుండా తనపై వేసిన అనర్హతను భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ సవాల్ చేసిన పిటిషన్‌పై ఇవాళ తీర్పు రానుంది. నిన్న వినేశ్ తరఫు వాదనలు విన్న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ఇవాళ రాత్రి 9.30 గంటలకు నిర్ణయాన్ని వెల్లడించనుంది. కోర్టు తీర్పు కోసం భారతావని ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఆమెకు మెడల్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. సీఏఎస్ ముందు ఇప్పటికే వినేశ్ తన వాదనలు వినిపించింది. వినేశ్ ఎలాంటి మోసానికి పాల్పడలేదని ఆమె లీగల్ టీం వాదించింది. శరీర సహజ ప్రక్రియలో భాగంగానే బరువు పెరిగినట్లు తెలిపారు. మొదటి రోజు పోటీల సందర్భంగా నిర్ణీత బరువులోనే ఉన్నట్లు చెప్పారు.