వారెవా...!! ఒకే ఓవర్లో ఆరు వికెట్లు
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. ఇప్పటివరకు మనం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చూశాం.. కానీ ఓ బౌలర్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు;
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. ఇప్పటివరకు మనం ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు చూశాం.. కానీ ఓ బౌలర్ ఒకే ఓవర్లో ఆరు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.. దుబాయ్ వేదికగా జరిగిన కర్వాన్ అండర్-19 గ్లోబల్ లీగ్ టీ20 టోర్నీలో భారత సంతతి(ఢిల్లీ)కి చెందిన స్థానిక కుర్రాడు హర్షిత్ సేథ్ ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడమీ ఆర్సీజీ జట్టుతో జరిగిన మ్యాచ్ లో దుబాయ్ స్టార్లెట్స్ జట్టు తరుపున డబుల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. మొత్తం 8 వికెట్లు(4-0-4-8) సాధించి సంచలనం సృష్టించాడు. అతడు తీసిన వికెట్లలలో నాలుగు బౌల్డ్‌లు కాగా మూడు ఎల్‌బీడబ్ల్యూ ఒక క్యాచ్ ఉంది. ఈ ఏడాది నవంబర్ 28న జరిగిన ఈ ఘట్టం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.