మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. హెచ్సీఏలో దాదాపు రూ.20 కోట్ల ఫ్రాడ్ చేశాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. అజారుద్దీన్ 2020 నుంచి 2023 వరకు హైదరాబాద్ క్రికెట్ అసోసి యేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా పని చేశాడు. ఆ సమయంలో హెచ్సీఏలో జరి గిన అక్రమాలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి. క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్. జిమ్ పరికరాలకు కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరో "పణలపై తాజాగా ఈడీ విచారణ చేప ట్టింది. ఇక ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ ను ఈడీ ఇప్పటికే విచారించింది.