FIXING: భారత టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు యత్నం.. కాశీ రుద్రాస్ మేనేజర్ చౌహాన్‌కు బుకీల వల.. రూ. కోటి వరకూ ఆశ చూపిన బుకీ... ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఫిక్సింగ్ కలకలం

Update: 2025-09-07 06:30 GMT

భా­ర­త్‌­లో జరు­గు­తు­న్న యూపీ టీ20 లీ­గ్‌­లో మ్యా­చ్ ఫి­క్సిం­గ్ ఆరో­ప­ణ­లు సం­చ­ల­నం సృ­ష్టిం­చా­యి. కాశీ రు­ద్రా­స్ జట్టు మే­నే­జ­ర్ అర్జు­న్ చౌ­హా­న్‌­ను బు­కీ­గా పరి­చ­యం చే­సు­కు­న్న వ్య­క్తి, మ్యా­చ్ ఫి­క్సిం­గ్‌­కు ఆహ్వా­నిం­చా­డ­ని ఫి­ర్యా­దు అం­దిం­ది. ఒక్కో మ్యా­చ్‌­కు రూ. 50 లక్షల నుం­చి కోటి రూ­పా­యల వరకు ఆఫర్ చే­శా­డ­ని తె­లు­స్తోం­ది. ఈ వ్య­వ­హా­రం­పై ఎఫ్‌­ఐ­ఆ­ర్ నమో­దు కా­వ­డం­తో పో­లీ­సు­లు దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు.

మ్యాచ్ ముగియగానే పేమెంట్

మ్యా­చ్ ఫి­క్సిం­గ్‌­కు ప్ర­య­త్నం జరి­గి­న­ట్టు బీ­సీ­సీ­ఐ­కి చెం­దిన యాం­టీ కరె­ప్ష­న్ యూ­ని­ట్(ఏసీ­యూ) గు­ర్తిం­చిం­ది. ఏసీ­యూ ఫి­ర్యా­దు మే­ర­కు లక్నో పో­లీ­సు­లు ఎఫ్ఐ­ఆ­ర్ నమో­దు చే­శా­రు. ఎఫ్‌­ఐ­ఆ­ర్ ప్ర­కా­రం.. కాశీ రు­ద్రా­స్ టీమ్ మే­నే­జ­‌­ర్ అర్జు­న్ చౌ­హా­న్‌­కు మ్యా­చ్ ఫి­క్సిం­గ్ చే­యా­ల­ని ఆగ­స్టు 19న ఓ ఇన్‌­స్టా­గ్రా­మ్‌ ఖాతా నుం­చి మె­సే­జ్‌­లు వచ్చా­యి. తాను పె­ద్ద బూ­కీ­గా పరి­చ­యం చే­సు­కు­న్న సదరు వ్య­క్తి అర్జు­న్‌­కు మ్యా­చ్ ఫి­క్సిం­గ్‌­కు రూ. కోటి ఆఫర్ చే­శా­డు. అలా­గే, కమీ­ష­న్‌­గా రూ. 50 లక్ష­లు ఇస్తా­న­ని చె­ప్పా­డు. తాను చె­ప్పిన ప్లే­య­ర్ల ప్ర­ద­ర్శన తనకు అను­కూ­లం­గా ఉం­డా­ల­ని, మ్యా­చ్ ము­గి­సిన వెం­ట­నే అమె­రి­కా డా­ల­ర్లు లేదా నగదు రూ­పం­లో చె­ల్లిం­పు­లు చే­స్తా­న­ని వా­యి­స్ కా­ల్స్, మె­సే­జ్‌ల రూ­పం­లో తె­లి­పా­డు. ఏసీ­యూ స్క్రీ­న్ షా­ట్స్, ఆడి­యో క్లి­ప్స్‌­ల­ను సే­క­రిం­చిం­ది. కాశీ రు­ద్రా­స్ టీమ్ మే­నే­జ­ర్ అర్జు­న్ చౌ­హా­న్‌­కు ‘vipss_nakrani’ అనే యూ­జ­ర్ నుం­చి ఇన్‌­స్ట్రా­గ్రా­మ్‌­లో ఓ మె­సె­జ్ వచ్చిం­ది. అం­దు­లో తను బు­కీ­ని అని,  మ్యా­చ్ ఫి­క్సిం­గ్ చే­స్తే కోటి రూ­పా­య­ల­తో పాటు అద­నం­గా 50 లక్షల రూ­పా­యల కమి­ష­న్ ఇస్తా­న­ని రాసి ఉం­దంట. వెం­ట­నే అర్జు­న్ ఈ వి­ష­యా­న్ని బీ­సీ­సీఐ అవి­నీ­తి ని­రో­ధ­‌క వి­భా­గా­ని­కి తె­లి­య­జే­శా­డు. వెం­ట­నే స్పం­దిం­చిన బీ­సీ­సీఐ చర్య­ల­కు ఉప­క్ర­మిం­చిం­ది.

నేరపూరిత కుట్ర

మ్యా­చ్ ఫి­క్సిం­గ్, బె­ట్టిం­గ్ ద్వా­రా నే­ర­పూ­రిత కు­ట్ర­కు ఉద్దే­శ­పూ­ర్వ­కం­గా జరి­గిన ప్ర­య­త్న­మ­ని బీ­సీ­సీఐ యాం­టీ కర­ప్ష­న్ వి­భా­గం గు­ర్తిం­చిం­ది. ఏసీ­యూ ఫి­ర్యా­దు మే­ర­కు అను­మా­నిత వ్య­క్తి, అతని సహ­చ­రు­ల­పై పలు కే­సు­లు నమో­దు చే­సి­న­ట్టు సౌత్ జోన్ డీ­సీ­పీ ని­పు­న్ అగ­ర్వా­ల్ తె­లి­పా­రు. ఇన్‌­స్టా­గ్రా­మ్ ఖా­తా­ను వా­డు­తు­న్న వ్య­క్తి­ని, అతని సహ­చ­రు­ల­ను గు­ర్తిం­చ­డా­ని­కి వి­చా­రణ జరు­గు­తుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. హర్ద­యా­ల్ సిం­గ్ చం­పా­వ­త్ (రీ­జి­న­ల్ ఇం­టి­గ్రి­టీ మే­నే­జ­ర్, యాం­టీ-కర­ప్ష­న్ యూ­ని­ట్, జై­పూ­ర్) లక్నో­లో ఫి­ర్యా­దు నమో­దు చే­శా­రు. పో­లీ­స్ స్టే­ష­న్లో ఎఫ్‌­ఐ­ఆ­ర్ నమో­దు కా­వ­డం­తో, లీగ్ ప్ర­తి­ష్ట గణ­నీ­యం­గా దె­బ్బ­తిం­ది. ప్ర­స్తు­తం పో­లీ­సు­లు బీ­ఎ­న్ఎ­స్ సె­క్ష­న్లు 49, 56, 61, 62, 112, 318, 319, అలా­గే పబ్లి­క్ గాం­బ్లిం­గ్ యా­క్ట్ (సె­క్ష­న్ 3), ఐటీ యా­క్ట్ 66డీ కింద కేసు నమో­దు చే­శా­రు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్‌లను మరొక ఫోన్‌లో రికార్డు చేసి పోలీస్‌లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. లక్నో పో­లీ­సు­లు ఆ వ్య­క్తి గు­ర్తిం­పు, నె­ట్వ­ర్క్, ఫి­క్సిం­గ్ ప్ర­య­త్నాల వె­నుక ఉన్న అసలు కో­ణా­న్ని బయ­ట­కు తీ­య­డా­ని­కి సవి­వ­ర­మైన దర్యా­ప్తు ప్రా­రం­భిం­చా­రు. ఈ ఏడా­ది ప్రా­రం­భం­లో జరి­గిన ఢాకా ప్రీ­మి­య­ర్ లీ­గ్‌­లో­నూ మ్యా­చ్ ఫి­క్సిం­గ్ కల­క­లం రే­పిం­ది. షై­న్‌­పు­కూ­ర్ క్రి­కె­ట్ క్ల­బ్, గు­ల్ష­న్ క్రి­కె­ట్ క్ల­బ్‌ల మధ్య జరి­గిన మ్యా­చ్‌­లో సబ్బీ­ర్ అను­మా­నా­స్ప­దం­గా ఔట్ అయ్యా­డు. ఈ వి­ష­యం­పై అవి­నీ­తి ని­రో­ధక వి­భా­గం వి­చా­రణ చే­ప­ట్టిం­ది. వి­చా­ర­ణ­లో ఆ మ్యా­చ్‌­లో రెం­డు వింత అవు­ట్‌­లు జరి­గా­య­ని గు­ర్తిం­చా­రు.

Tags:    

Similar News