IPL: నేడు ముంబై, గుజరాత్ మ్యాచ్
రీ ఎంట్రీ ఇవ్వనున్న హార్దిక్ పాండ్యా... మోదీ స్టేడియంలో మ్యాచ్;
IPL 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ నేడు పోటీ పడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక్కడ ఇరు జట్లు 5 మ్యాచుల్లో ముఖాముఖిగా తలపడగా గుజరాత్ మూడు మ్యాచుల్లో నెగ్గింది. చెన్నైలో డకౌట్ అయిన రోహిత్ శర్మ, రీ ఎంట్రీ ఇస్తున్న పాండ్యా, గుజరాత్ కెప్టెన్ గిల్ ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ..
IPL 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. హార్దిక్ కోసం.. పేసర్ విల్ జాక్స్‌పై వేటు వేసే అవకాశం ఉంది. స్లో ఓవర్ రేట్ కారణంగా తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరమైన సంగతి తెలిసిందే. గతంలో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీని నడిపించిన హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు అదే జట్టుపై వ్యతిరేకంగా ఆడనున్నాడు.
రిహాబిలిటేషన్‌కే పరిమితమైన బుమ్రా
స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం ఇంకా ముంబై ఇండియన్స్ జట్టుకు అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. బెంగళూరులోని ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. బుమ్రా అందుబాటులో లేకపోవడం ముంబై ఇండియన్స్‌కు పెద్దలోటు అనే చెప్పాలి. అయితే, హార్దిక్ పాండ్యా రీఎంట్రీతో ముంబై బౌలింగ్ ఆప్షన్స్ కూడా పెరగనున్నాయి. తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
KKR, LSG మ్యాచ్ తేదీలో మార్పు
ఏప్రిల్ 6న జరగాల్సిన కోల్‌కతా నైట్‌రైడర్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మ్యాచ్ తేదీలో మార్పు జరిగింది. ఈ మ్యాచ్‌ను ఏప్రిల్ 8వ తేదీకి బీసీసీఐ వాయిదా వేసింది. ఏప్రిల్ 6న కోల్‌కతాలో ఉత్సవాలు ఉండడంతో క్రికెట్ కోసం పూర్తి స్థాయిలో సిబ్బందిని కేటాయించలేమని కోల్‌కతా పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో KKR, LSG మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.