IPL: గిల్‌‌పై నిషేధం తప్పదా?

Update: 2025-05-03 12:30 GMT

 హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు సార్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఘటనపై విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రవర్తనతో గిల్ IPL నిబంధనల ప్రకారం కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8ను ఉల్లంఘించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది లెవెల్ 2 నేరంగా పరిగణించి గిల్‌కి ఒక మ్యాచ్ నిషేధం, మ్యాచ్ ఫీజులో 50 నుంచి 100 శాతం కోత, 3 డీమెరిట్ పాయింట్లు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. లెవల్‌ 1 నేరం: ఈ తప్పిదం కింద సదరు ఆటగాడికి హెచ్చరిక ఇవ్వొచ్చు. లేదా 25 శాతం వరకు లేదా 50 శాతం లోపు మ్యాచు ఫీజులో జరిమానా విధించొచ్చు. ఒకటి నుంచి రెండు డీ మెరిట్‌ పాయింట్లను కేటాయిస్తారు.  లెవల్ 2 నేరం: ఒక సస్పెన్షన్ పాయింట్‌ విధించే అవకాశం. మ్యాచు ఫీజులో 50 నుంచి 100 శాతం జరిమానా. మూడు డీమెరిట్ పాయింట్ల విధించే అవకాశం ఉంది.

Tags:    

Similar News