స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ విశ్లేషించారు. ‘నాకు తెలిసినంత వరకూ విరాట్ ఆటలో లోపం లేదు. ఇది మానసికంగా ఏర్పడిన అడ్డంకి అనుకుంటున్నా. కొంచెం ఆలస్యంగా బంతిని ఆడుతున్నారు. ఆయన ధీమాగా ఉండాలి. తాను విరాట్ కోహ్లీని అన్న విషయం మరచిపోకూడదు. ఎవరికీ ఏమీ నిరూపించుకునే అవసరం ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన రోల్ మోడల్ అని మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. ఆయనతో కలిసి మైదానంలో నడుస్తుంటే అడవిలో సింహంతో వెళ్తున్నట్లే అనిపించేదని చెప్పారు. అయితే ఛేజింగ్‌లో సచిన్, కోహ్లీలో ఎవరు బెస్ట్ అనే పోటీ వస్తే మాత్రం విరాట్‌కే తాను ఓటు వేస్తానని తెలిపారు. 2011-12 నుంచి ఇప్పటివరకు చాలా మారిపోయినట్లు వెల్లడించారు. టీమ్ ఇండియాకు ఎన్నో కీలక ఇన్నింగ్సులు ఆడారని ప్రశంసించారు.