Harbhajan Singh : 10 వేల రన్స్ చేయగలవని కోహ్లీకి చెప్పా : హర్బజన్ సింగ్

Update: 2024-09-04 05:45 GMT

విరాట్ కోహ్లీ యాటిట్యూబ్ తనకు నచ్చుతుందని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ తెలిపాడు. కోహ్లీ కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అతడితో మాట్లాడిన విషయాలను హర్బజన్ సింగ్ షేర్ చేసుకున్నాడు.‘నాకు ఒక సంఘటన గుర్తుంది. అది శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్. అజంతా మెండిస్ వరుసగా వికెట్లు తీస్తున్నాడు. అప్పుడు క్రీజులోకి వచ్చిన కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఎలా ఆడాను అని కోహ్లీ నన్ను అడిగాడు. బాగా ఆడావని చెప్పా. నేను ఔట్ కాకుండా మరిన్ని పరుగులు చేయాల్సింది అన్నాడు. అతడి యాటిట్యూడ్‌ నాకు నచ్చింది. కోహ్లీ టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్‌లో అతని అరంగేట్రం వెస్టిండీస్‌పై జరిగింది. విండీస్‌ పేసర్ ఫిడెల్ ఎడ్వర్డ్స్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ షార్ట్ బాల్‌తో కోహ్లీని బోల్తా కొట్టించాడు. దీంతో అతడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేనా?అనే అనుమానాలు పెంచుకున్నాడు. అప్పుడు నేను కోహ్లీతో ‘‘టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు చేయకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీకు టెస్టుల్లో 10 వేల రన్స్‌ చేయగలిగే సత్తా ఉంది. నువ్వు దీన్ని పూర్తి చేయకపోతే అది తప్పే అవుతుంది’ అని కోహ్లీతో చెప్పిన విషయాలను హర్బజన్ గుర్తు చేసుకున్నాడు.

Tags:    

Similar News