Hardik Pandya: ప్రపంచకప్‌కు దూరం కావడంపై ఆవేదన
జట్టుకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్న ఆల్‌రౌండర్;
బంగ్లాదేశ్‍తో మ్యాచ్‌లో బంతిని ఆపే క్రమంలో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మెగాటోర్నీ మొత్తానికీ దూరమయ్యాడు. పాండ్యా స్థానంలో యువబౌలర్ ప్రసిద్ధ కృష్ణను బ్యాకప్‌గా తీసుకున్నారు. అయితే చీలమండ గాయంతో అనూహ్యంగా ప్రపంచకప్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆవేదనతో స్పందించాడు. ప్రపంచకప్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరమైన విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందన్నాడు. అయినప్పటికీ తాను జట్టుతోనే ఉంటానని, ప్రతి బంతికీ జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు. అభిమానుల ప్రేమ, ఆప్యాయతలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ జట్టు చాలా ప్రత్యేకమైనదని, ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తామని చెప్పుకొచ్చాడు.
పూణెలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చీలమండ గాయంతో హార్దిక్ ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్, ఇంగ్లండ్ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లిన తర్వాత అతను నాకౌట్ గేమ్‌లకు ఫిట్‌గా ఉంటాడని అంతా భావించారు. ప్రస్తుతానికి గాయంతో కొన్నిరోజులు టీమిండియాకు దూరమైన హార్దిక్... ఏడాది కిందటే జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం వన్డే ప్రపంచకప్ కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. సీమ్-బౌలింగ్ ఆల్-రౌండర్‌గా జట్టు బ్యాలెన్స్ అందిస్తోన్న హార్దిక్.. చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేశాడు. నాలుగు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు తీశాడు. కానీ.. దురదృష్టం కొద్దీ బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో బాల్‌ను ఆపే సమయంలో గాయపడిన హార్దిక్.. వరల్డ్ కప్ మొత్తానికి దూరం కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.
"ప్రపంచకప్‌లో మిగతా మ్యాచ్‌లకు దూరం అయ్యాననే వాస్తవాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టంగా ఉంది. జట్టుకు దూరమైనా నా మనసంతా అక్కడే ఉంటుంది. ప్రతి మ్యాచ్‌లో, ప్రతి బంతికీ వారిని ప్రోత్సహిస్తూనే ఉంటా. నా కోసం ప్రార్థించిన అందరికీ నా ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమ, మద్దతు అనిర్వచనీయం. ఈ టీమ్ చాలా ప్రత్యేకం, కచ్చితంగా అందరినీ గర్వపడేలా చేస్తుంది".. అంటూ నోట్ షేర్ చేశాడు హార్దిక్ పాండ్యా. పాండ్యా స్థానంలో యువ పేసర్ ప్రసీద్ కృష్ణకు చోటు లభించింది.