T20 World Cup : మహిళా టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ.. రూ.66 కోట్లు

Update: 2024-09-17 15:00 GMT

మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వరల్డ్ కప్ లో మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు ప్రైజ్‌మనీ అందిస్తామని ప్రకటించింది. వచ్చే నెల జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ నుంచే ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ నిర్ణయంతో టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచిన టీమ్ రూ.19 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకోనుంది. గత టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్‌మనీతో పోలిస్తే ఇది 134 శాతం అధికం. రన్నరప్‌గా నిలిచిన టీమ్ కు రూ.9 కోట్ల క్యాష్​ ప్రైజ్ అందుకుంటుంది. సెమీ ఫైనల్‌లో ఓడిన రెండు టీమ్స్ కు గతంలో 2,10,000 అమెరికన్‌ డాలర్లు ఇవ్వగా.. ఇప్పుడు దానిని 6,75,000 అమెరికన్‌ డాలర్లకు పెంచారు. మొత్తం ప్రైజ్‌మనీ 7,958,080 అమెరికన్ డాలర్లు (రూ.66 కోట్లు). గతంతో పోలిస్తే ఇది 225 శాతం అధికం.

మహిళల టీ20 వరల్డ్ కప్‌ అక్టోబర్ 3 నుంచి 20 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. అయితే, వరల్డ్ కప్ బంగ్లాదేశ్​ లో జరగాల్సి ఉండగా.. అక్కడ కల్లోల పరిస్థితుల నేపథ్యంలో ఐసీసీ యూఏఈకి వేదికను మార్చింది. మొత్తం 10 టీమ్స్ ను రెండు గ్రూప్ లుగా డివైడ్ చేశారు. గ్రూప్ లోని ప్రతి టీమ్ ఇతర టీమ్ తో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్2లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ కు చేరుతాయి. గ్రూప్‌ – ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్‌, శ్రీలంక.. గ్రూప్‌ బిలో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ఉ న్నాయి. భారత్‌ అక్టోబర్ 4న న్యూజిలాండ్‌, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో ఆడుతుంది. భారత్‌ – పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌లో జరగనుంది.

Tags:    

Similar News