ICC: బౌండరీ రోప్ అవతల క్యాచ్.. కీలక మార్పులు
కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ;
క్రికెట్ నిబంధనల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మరో కీలక మార్పు చేసింది. బన్నీ హాప్ క్యాచ్‌లపై నిషేధం విధించింది. ఈ మార్పుతో బౌండరీ లైన్‌పై అందుకునే క్యాచ్‌లపై మరింత స్పష్టతను ఇచ్చింది. ఇక బౌండరీపై క్యాచ్‌లు అందుకునే ఫీల్డర్లు.. బయట ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. రెండోసారి తాకితే సిక్సర్‌గా పరగణిస్తారు. గతంలో బౌండరీ బయట గాల్లో ఉంటూ బంతిని ఒకటి కంటే ఎక్కువ సార్లు తాకి అందుకున్న ఔటిచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ రూల్‌ను సవరించారు. బౌండరీ బయట గాల్లో ఒకసారి మాత్రమే బంతిని తాకాలి. మరోసారి తాకితే సిక్సర్‌గా ఇస్తారు. ఈ రూల్ రిలే క్యాచ్‌లకు కూడా వర్తిస్తుంది. అంటే ఓ ఫీల్డర్ బౌండరీ బయట బంతిని గాల్లో నుంచి లోపల ఉన్న ఫీల్డర్‌కు అందజేసినా.. అతను పూర్తిగా గ్రౌండ్‌లోనే ఉండాలి. లేకుంటే ఇది కూడా బౌండరీ అవుతుంది.
కొత్త మార్పులకు కారణమిదే
ఆస్ట్రేలియా టీ20 ఫ్రాంచైజీ టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో మైకేల్ నెసర్ అందుకున్న ఓ క్యాచ్ తీవ్ర వివాదాస్పదమైంది. బౌండరీ బయట మైకేల్ నెసర్.. రెండు సార్లు బంతిని తాకి క్యాచ్‌ను పూర్తి చేశాడు. పాత రూల్స్ ప్రకారం అది ఔట్ అయినా.. ఇక నుంచి అలాంటి క్యాచ్‌లు బౌండరీగా మారుతాయి. మైకేల్ నెసర్ అందుకున్న ఈ క్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దం అంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. దీంతో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నయా రూల్.. మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ రూల్ బుక్‌లో అక్టోబర్ 2026లో అధికారికంగా చేర్చనున్నారు. డబ్ల్యూటీసీ 2025-27లో భాగంగా జూన్ 17 నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ రూల్‌ను అమలు చేయనున్నారు. దీంతో ఐసీసీ కీలక మార్పు తెచ్చింది. ఇకపై బౌండరీ రోప్ బయట బంతిని ఒకటి కంటే ఎక్కువ సార్లు గాల్లోకి ఎగురవేయడం కుదరదన్నమాట. ఇలాంటి క్యాచ్‌లు సరైనవి కావంటూ పలువురు క్రికెట్ అభిమానులు, విశ్లేషకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై కొందరు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం ఇది సరైన నిర్ణయమేనంటూ సమర్థిస్తున్నారు.