Ind vs Eng : నాలుగో టెస్టులో భారత్‌ విజయం.. సిరీస్‌ కైవసం

Update: 2024-02-26 08:25 GMT

రాంచీ మైదానం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో భారత్‌ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే 3-1తో భారత్ కైవసం చేసుకుంది. 192 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజును ఆటను ప్రారంభించిన భారత్‌ ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

శుభ్‌మన్‌ గిల్ (52*), ధ్రువ్ జురెల్ (39*) చివరి వరకూ క్రీజ్‌లో ఉండి జట్టును విజయతీరాలకు చేర్చారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అంతకుముందు రోహిత్‌ శర్మ (55), యశస్వి (37) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. హార్టిలి, రూట్ కు తలో వికెట్ దక్కింది.ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 353, రెండో ఇన్నింగ్స్‌లో 145, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగుల చేసింది.

Tags:    

Similar News