England vs India: 78 పరుగులకే కుప్పకూలిన భారత్
England vs India 3rd Test: మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌటైంది.;
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 78 పరుగులకు ఆలౌటైంది. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 56 రన్స్ చేసిన భారత్..రెండో సెషన్‌లో 22 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్(0), చతేశ్వర్(1), విరాట్ కోహ్లీ(7), పంత్(2), జడేజా(4) పరుగులు చేసి తీవ్రంగా నిరాశపర్చారు. ఓపెనర్ రోహిత్ శర్మ(19) టాప్ స్కోరర్. రహానె(18) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 3, ఓవర్టన్ 3, రాబిన్సన్ 2, సామ్ కరన్ 2 వికెట్లు పడగొట్టారు. మరోవైపు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది.