IND vs SL: ఆఖరి వన్డే.. గబ్బర్‌సేనలో భారీ మార్పులు
IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. నేడు మూడో మూడో పోరుకు సిధ్దమైంది భారత్..;
Team India File Photo
IND vs SL: శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ 2-0తో ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది. నేడు మూడో మూడో పోరుకు సిధ్దమైంది భారత్.. ఆఖరి వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు వరుస ఓటములతో కుదేలైన లంకేయులు ఒక్క మ్యాచైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నారు. మూడో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు ఉండనున్నాయి. పృథ్వీ షా (43, 13) స్థానంలో మరో ఆటగాడు గబ్బర్‌తో పాటు రిలోకి దిగొచ్చు. దేవదత్ పడిక్కల్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లో ఒకరికి అవకాశం దక్కొచ్చు.
టీ20 సిరీసును దృష్టిలో పెట్టుకుని కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి నివ్వాలని మేనెజ్ మెంట్ భావిస్తుంది. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పడిక్కల్, రుతురాజ్‌కు మంచి అనుభవం ఉంది. పరుగుల వరద పారించారు. మిడిలార్డర్లో మనీశ్ పాండే, సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నారు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ తప్పించి.. సంజు శాంసన్ కు అవకాశం రావొచ్చు. టీ20 క్రికెట్ నేపథ్యంలో కృనాల్ పాండ్య, స్థానంలో రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భూవనేశ్వర్ స్థానంలో నవదీప్ సైనిని ఆడించే అవకాశాలు ఉన్నాయి. అయితే శ్రీలంక జట్టులో కూడా మార్పులు ఖయంగా కనిపిస్తుంది. కొత్త వారికి ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చివరి వన్డేలోనూ ఆడితే భారత్‌కు శ్రీలంక గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.