బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండవ టీ20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మీర్పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. తక్కువ స్కోర్లే నమోదైనప్పటికీ భారత బౌలర్లు రాణించడంతో ఘన విజయం సాధించింది. లక్ష్యానికి చేరువగా వచ్చిన బంగ్లా 8 బంతుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయి సిరీస్‌ని కోల్పోయింది.
మొదటి ఇన్సింగ్స్‌లో 95 పరుగులు మాత్రమే చేసిన భారత్‌ను బౌలర్లు షెఫాలీ వర్మ, మిన్ను మణిలు తమ స్పిన్‌తో బంగ్లాను చావు దెబ్బకొట్టారు. వీరిద్దరూ కలిసి 5 వికెట్లు తీశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానా 55 బంతుల్లో 38 పరుగులతో మ్యాచ్‌ను గెలిపించేలా చేసింది. అయితే కీలకమైన చివరి దశలో 10 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో ఔటయ్యింది. చివరి ఓవర్లో 8 పరుగులే అవసరమైనప్పటికీ షఫాలీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆ ఓవర్లో ఒక రనౌట్‌తో సహా 4 వికెట్లు పడ్డాయి.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 4.1 ఓవర్లలో 33 పరుగుల నుంచి ఇన్నింగ్స్ ముగిసేసరికి 95/8 పరుగుల స్థితికి చేరుకున్నారు. ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధనాలు బౌండరీలతో శుభారంభాన్నందించారు. పవర్‌ప్లే చివరి ఓవర్లో వరుస బంతుల్లో మందన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌లు ఔటయ్యారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి చెమటోడ్చారు. 6 ఓవర్ల నుంచి 13వ ఓవర్ల దాకా ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదంటేనే ఎంత నెమ్మదిగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. 8వ నంబర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అమన్‌జోత్ కౌర్ 17 బంతుల్లో 14 పరుగులు చేసి స్కోర్‌ని కొంచెం పెంచింది.
బంగ్లా ఫీల్డర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు, అద్భుతమైన ఫీల్డింగ్‌తో క్యాచ్‌లు పట్టడంతో భారత్ స్కోర్‌ను 100 లోపే కట్టడి చేయగలిగారు. మ్యాచ్‌లో సింహభాగం స్పిన్నర్లే బౌలింగ్ చేశారు. మొత్తం 40 ఓవర్లలో 35 ఓవర్లు స్పిన్నర్లతోనే బౌలింగ్ సాగింది. బంగ్లా జట్టు కేవలం ఒక్క పేసర్‌నే జట్టులోకి తీసుకుంది. ఇక భారత స్పీన్నర్లు 19 ఓవర్లు వేయడం విశేషం. పూజా వస్త్రాకర్ 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ వేసింది.