2008లో జరిగిన ఐపీఎల్లో బౌలర్ శ్రీశాంత్‌ను మరో బౌలర్ హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన ఘటన అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. 2008లో నిర్వహించిన తొలి ఐపీఎల్లో ఈ ఘటన జరిగింది. ఐపీఎల్ చరిత్రలో ఇదో చేదు ఘటనగా మిగిలిపోయింది. ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న స్పిన్నర్ హర్భజన్.. మ్యాచ్ ముగిసిన తర్వాత పంజాబీ బౌలర్ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టాడు. ఈ ఘటన జరిగిన 18 ఏళ్లు అవుతోంది. ఇద్దరు ప్లేయర్ల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసిన ఆ ఘటనకు చెందిన ఒరిజినల్ వీడియోను లలిత్ మోదీరిలీజ్ చేశారు. అప్పట్లో ఐపీఎల్ చైర్మెన్‌గా లలిత్ మోదీ వ్యవహరించారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోదీ ఆ చెంపదెబ్బ ఘటన గురించి ప్రస్తావించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కెమెరాలు అన్నీ ఆఫ్ అయ్యాయని, కానీ తన సెక్యూర్టీ కెమెరా ఆన్‌లో ఉండడం వల్ల ఆ ఘటన చిక్కినట్లు లలిత్ మోదీ తెలిపారు. 18 ఏళ్లుగా ఈ వీడియోను దాచిపెట్టినట్లు ఆయన చెప్పారు.