IPL Final 2021 : ఇవాళే ఐపీఎల్ ఫైనల్ .. చెన్నై vs కోల్‌కత్తా..!
IPL Final 2021 : ఇవాళే ఐపీఎల్ ఫైనల్ ఫైట్. ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.;
IPL Final Match 2021 : ఇవాళే ఐపీఎల్ ఫైనల్ ఫైట్. ట్రోఫీ కోసం చెన్నై సూపర్‌కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశల్లో అద్భుత ఆట తీరుతో ఫైనల్ చేరిన ఇరు జట్లు కీలక పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐపీఎల్‌లో ఇప్పటివరకు మూడుసార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై.. రెండు సార్లు కప్పు ముద్దాడిన కేకేఆర్ జట్లు మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాయి. ఇరుజట్ల మధ్య తుది పోరు ఇవాళ రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. గత ఏడాది ప్లే ఆఫ్స్‌కే అర్హత సాధించని ఇరు జట్లను కెప్‌టన్లు ధోని, మోర్గాన్ ఈ సీజన్‌లో సమర్థంగా నడిపించారు. ఇప్పుడు అసలు పోరులో వారి సారథ్యం, బ్యాటింగ్ సామర్థ్యం జట్టుకు గెలిపిస్తాయా అనేది ఆసక్తికరం. ధోని నాయకత్వంలోనే చెన్నై మూడు సార్లు చాంపియన్‌గా నిలవగా.... వరల్డ్ కప్ గెలిపించిన మోర్గాన్ సారథిగా తొలి ఐపీఎల్ టైటిల్‌పై కన్నేశాడు.