IPL 2021: ఐపీఎల్ 2021.. చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్..

ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది

Update: 2021-09-13 06:58 GMT

IPL 2021: ఐపీఎల్ 2021 రెండో దశ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. జట్టులోని ఇద్దరు స్టార్ ఆటగాళ్లు గాయాల బారిన పడి ఆటకు దూరమవగా, మరో ఇద్దరు ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ప్రస్తుతం సీపీఎల్ 2021 లో ఆడుతున్న బ్రావో, డుప్లెసిస్ గాయపడగా.. ఇంగ్లండ్ క్రికెటర్లు సామ్ కరన్, మొయిన్ అలీలు టీ 20 ప్రపంచకప్ నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రావో కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం కానుండగా, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో తగిలిన గాయం కారణంగా డుప్లెసిస్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం ఉంది.

మరో వైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు సామ్ కరన్, మొయిన్ అలీలు ఐపీఎల్ అనంతరం రెండు రోజుల్లో ప్రారంభమయ్యే టీ 20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈసీబీ నిబంధనల ప్రకారం వారు మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఇంగ్లండ్ బృందంలో చేరాల్సి ఉంది. ఇలా ఒకేసారి నలుగురు ఆటగాళ్లు దూరమవుతుండడంతో సీఎస్‌కేకు టైటిల్‌పై ఆశలు నీరుగారుతున్నాయి.

ఐపీఎల్ తొలి సీజన్ వాయిదా పడే సమయానికి 7 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్.. ఐదు మ్యాచులు గెలుపొందిన విషయం తెలిసిందే.. మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం. అయితే మొదటి దశలో కీలక మొదటి దవలో కీలక పాత్ర పోషించిన డుప్లెసిస్, మొయిన్ అలీ, సామ్ కరన్‌లు కీలక దశలో జట్టును వీడితే ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Tags:    

Similar News