ఇండియన్ ప్రీమియర్(ఐపీఎల్) మెగా వేలంపై ఉత్కంఠకు తెరపడింది. ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్షన్ తేదీ ఫిక్స్ అయింది తెలుస్తోంది. 18వ సీజన్ కోసం మెగా వేలం నిర్వహిస్తున్నట్లు సమాచారం. వచ్చే నవంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో వేలం పాటను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. అయితే.. ఈసారి కూడా విదేశాల్లోనే యాక్షన్ నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అబూదాబీ, సౌదీ అరేబియాలో మెగా వేలం జరిపేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. ఈ వేలంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 17వ సీజన్ మినీ వేలాన్ని దుబాయ్‌లోని కొకకోలా ఎరెనాలో నిర్వహించారు. ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్లు పలికిన సంగతి తెలిసిందే.