IPL: పాక్‌తో యుద్దం... ఐపీఎల్ వారం వాయిదా
నిలిచిన ఐపీఎల్ అంటూ ప్రగల్బాలు పలికిన పాక్... వారంలోనే మళ్లీ ఐపీఎల్ ప్రారంభం;
ఆసక్తికరంగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో అనూహ్యంగా చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా స్టేడియంలోని వీక్షకులంతా షాక్ అయ్యారు. కొద్దిసేపు క్రికెటర్లతో పాటు టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులకు కూడా అయోమయానికి గురయ్యారు. మొదట ఫ్లడ్ లైట్స్‌లో ఎదో తేడా అనుకున్నారు. తర్వాత బ్లాక్ అవుట్ కారణంగా మ్యాచ్ ఆపేసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఐపీఎల్ ఛైర్మన్ అర్జున్ ధుమాల్ డైరెక్ట్‌గా గ్రౌండ్‌లోకి దిగి ప్రేక్షకులను బయటకి పంపడానికి అన్ని మార్గాలను క్లియర్ చేశాడు. ఇది మే 8 గురువారం పంజాబ్, ఢిల్లీ మధ్య ధర్మశాలలో జరుగుతున్న మ్యాచులో కనిపించిన విజువల్స్. కొద్దిసేపటికే ఈ మ్యాచును రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ప్రకటించింది. కొద్దిసేపటికే ఐపీఎల్‌ను పూర్తిగా రద్దు చేయనున్నారు అని వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దాయాది పాక్ నికృష్ట చర్యలకు భాగంగా వరల్డ్ మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీ గేమ్ ఐపీఎల్ తాత్కాలికంగా నిలిచిపోయింది. దీంతో పాక్ ఫేక్ సోషల్ మీడియా 'పాక్ దెబ్బకు ఐపీఎల్ ఢమాల్' అని రాసుకొచ్చింది. వాస్తవానికి జరిగింది మాత్రం ఒక వైపు భారత్ ఆర్మీ పోరాడుతుంటే క్రికెటర్లు ఎంటర్‌టైన్మెంట్ అందించడం సరికాదనే ఉద్దేశంతో ఐపీఎల్ తీసుకున్న నిర్ణయమిది. ఆటగాళ్లు, ప్రేక్షకుల భద్రతకు విశ్వాసం కల్పించడమే ఈ నిర్ణయం.
మళ్ళీ షురూ...
భారత్-పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ మ్యాచులను వారం రోజుల పాటు వాయిదా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్‌లు, స్పాన్సర్లతో కీలక సమావేశం తర్వాత ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ఐపీఎల్ పాలకమండలి తెలిపింది. ఐపీఎల్‌లో ఇంకా 16 మ్యాచులున్నాయి. మొదట ఈ మ్యాచులను భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ తర్వాత నిర్వహించాలని భావించిన అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వారం రోజుల గ్యాప్‌లోనే తిరిగి నిర్వహించడానికి సిద్ధమయ్యారు. వేదికలను, రీ షెడ్యూల్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.
ప్లే అఫ్స్ చేరాలంటే
ఐపీఎల్ కీలక ప్లే ఆఫ్స్ దశకు కొంచెం దూరంలో ఉంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలగగా 7 టీంలు పోటీ మీద ఆడుతున్నాయి. ఈ టోర్నీలో 14 మ్యాచులకు గాను 11 గెలిచినా ఆర్సీబీ మిగిలిన మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచిన ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. పంజాబ్, గుజరాత్‌ది కూడా అదే పరిస్థితి. ముంబై ఆడాల్సిన రెండు మ్యాచుల్లో రెండు గెలిస్తేనే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ మూడు మ్యాచుల్లో 2 తప్పనిసరిగా గెలవాల్సిందే. కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మాత్రమే ఆడాల్సిన మూడు మ్యాచుల్లో మూడు గెలిచిన పరిస్థితి క్లిష్టంగానే ఉంది. మరోవైపు లక్నో జట్టు టెక్నీకల్‌గా రేసు నుంచి వైదొలిగింది కానీ ఏదైనా అద్భుతం జరిగితే ప్లే ఆఫ్స్‌కు చేరుకునే అవకాశముంది.