IPL: చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

వరుసగా అత్యధిక విజయాలు సాధించిన సారధిగా రెండోస్థానంలో అయ్యర్;

Update: 2025-04-03 05:00 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వరుస విజయాలు అందుకున్న రెండో కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. సారథిగా శ్రేయస్ వరుసగా 8 విజయాలు సాధించాడు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లో.. లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ విజయం సాధించింది. ఈ గెలుపుతో శ్రేయస్ ఈ అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున సారథిగా ఆరు విజయాలు సాధించిన శ్రేయస్.. ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున రెండు విజయాలు ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం షేన్‌ వార్న్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో గౌతమ్ గంభీర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 2014-15లో గౌతీ కేకేఆర్ తరఫున 10 వరుస విజయాలు అందుకున్నాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా వార్న్‌ 8 విజయాలు సాధించాడు. 2013లో చెన్నై సారథిగా ఏడు వరుస విజయాలు సాధించి.. మూడో స్థానంలో నిలిచాడు.

మన చిచ్చరపిడుగుకు హార్దిక్ పాండ్యానే స్ఫూర్తి

ఈ ఐపీఎల్లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టు నుంచి యంగ్ ప్లేయర్​ అనికేత్ వర్మ వెలుగులోకి వచ్చాడు. విధ్వంసకర ఆటతీరుతో ఈ ఆటగాడు ఆకట్టుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచులో అనికేత్ 41బంతుల్లోనే 74 పరుగులు చేసి అబ్బురపరిచాడు. దీంతో ఒక్కసారిగా అనికేత్​కు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్య అతడికి స్ఫూర్తిగా నిలిచాడని అనికేత్ అంకుల్ అమిత్ వర్మ వెల్లడించారు. తాను నాలుగేళ్లపాటు మ్యాగీ న్యూడిల్స్‌ తినే క్రికెట్ ప్రాక్టీస్‌కు వెళ్లినట్లు హార్దిక్​ గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. ఇంటర్వ్యూల్లో హార్దిక్​ మాటలు విన్న అనికేత్ కెరీర్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రిపేర్ అయినట్లు అమిత్ పేర్కొన్నారు. అనికేత్‌కు 14ఏళ్లు ఉన్నప్పుడు న్యూస్‌ పేపర్‌లో వార్తను అనికేత్‌కు చెప్పానని అదే అతనిలో అనికేత్‌లో ఆట పట్ల ప్యాషన్‌, పరుగుల దాహాన్ని పెంచిందని చెప్పాడు.

అందుకే బ్రో.. అతి చెయ్యొద్దు

లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో స్పిన్నర్ దిగ్వేశ్‌ రాఠిపై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. యానిమేటెడ్ నోట్‌బుక్ సెలెబ్రేషన్స్ చేసుకున్నందుకు దిగ్వేష్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాను విధించింది. ఒక డీమెరిట్ పాయింట్‌ను అతడి ఖాతాలో చేర్చింది. దిగ్వేష్ తన తప్పును ఒప్పుకోవడంతో బీసీసీఐ జరిమానాతో సరిపెట్టింది.

ఏం జరిగిందంటే..

పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దిగ్వేష్ రతి వేసిన ఈ ఓవర్‌ తొలి బంతిని ప్రియాన్ష్ ఆర్య బౌండరీకి తరలించాడు. ఔట్ సైడ్ ఆఫ్‌ స్టంప్‌ దిశగా ఫుల్‌గా వేసిన రెండో బంతిని కూడా ప్రియాన్ష్ డ్రైవ్ షాట్‌తో బౌండరీ బాదే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్‌లో ఉన్న మిచెల్ మార్ష్ దిశగా దూసుకెళ్లింది. కానీ అతను క్యాచ్‌ పట్టలేకపోయాడు. ఇదే ఓవర్‌ ఐదో బంతిని ప్రియాన్ష్ ఆర్య పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. మిస్‌టైమ్ అయిన బంతి గాల్లోకి లేచింది. మిడాన్‌లో శార్దూల్ ఠాకూర్ సునాయస క్యాచ్‌ను అందుకున్నాడు. వెంటనే ప్రియాన్ష్ ఆర్య దగ్గరకు పరుగెత్తిన దిగ్వేష్ రతి.. నోట్‌బుక్‌లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ సంబరాలను తప్పుబడుతూ.. ఫీల్డ్ అంపైర్.. దిగ్వేష్ రతికి వార్నింగ్ ఇచ్చాడు.

Tags:    

Similar News