BGT: టెస్టు క్రికెట్ లో ముగిసిన రోహిత్ శకం..!

Update: 2025-01-03 01:00 GMT

భారత క్రికెట్ జట్టు స్టార్‌గా రోహిత్ శర్మ ప్రయాణం ముగిసినట్లే కనిపిస్తోంది. కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో సుదీర్ఘ ఫార్మాట్ లో హిట్ మ్యాన్ శకం ముగిసిందని మాజీలు అంచనా వేస్తున్నారు. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్‌లలో రోహిత్ 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ గత 15 ఇన్నింగ్స్‌లలో ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. 10 సార్లు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. బోర్డర్ - గవాస్కర్ సిరీ‌స్ లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన వేళ.. సిడ్నీ టెస్టులో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో టీమిండియా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇచ్చారు. భారత్ లో జరిగిన న్యూజిలాండ్ సిరీస్.. ఇప్పుడు జరుగుతున్న సిరీస్ లోనూ రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో రోహిత్ శర్మపై విమర్శల జడివాన కురుస్తోంది. 5వ టెస్టులో రోహిత్ కు తుది జట్టులో చోటు దక్కలేదు.

అదే మిస్టేక్‌తో విరాట్ ఔట్

BGT ట్రోఫీలో భాగంగా ఆసీస్, భారత్ మధ్య సిడ్నీ వేదికగా చివరి టెస్టు జరుగుతుంది. బ్యాటింగ్ చేస్తున్న భారత్ 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చేసిన మిస్టేక్ నే కోహ్లి మరోసారి పునరావృతం చేశాడు. ఆఫ్‌సైడ్ బంతిని వెంటాడి స్లిప్‌లో విరాట్ దొరికిపోయాడు. బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతిని వెబ్‌స్టర్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. కేవలం 17 పరుగులు చేసి కోహ్లి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ స్కోర్: 80/4

మళ్లీ విఫలమైన కోహ్లీ.. విమర్శల వర్షం

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలు కొనసాగుతున్నాయి. కీలకమైన అయిదో టెస్టులోనూ విరాట్ కేవలం 17 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. నిర్లక్ష్యంగా ఆఫ్ సైడ్ వెళ్లే బంతిని వెంటాడిన కోహ్లీ.. స్లిప్ లో దొరికిపోయాడు. దీంతో కోహ్లీపై విమర్శల జడివాన కురుస్తోంది. ఇప్పటికే ఈ టెస్టు నుంచి రోహిత్ తప్పుకోగా... కోహ్లీని కూడా తప్పిస్తే బాగుండేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News