JUREL: భవిష్యత్తు "ధ్రువ్" తార అతడేనా..?
సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్.. కీపర్‌గాను సూపర్‌గా రాణించిన జురెల్.. ఆత్మవిశ్వాసంతో కనిపించిన జురెల్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయం తర్వాత జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు ధ్రువ్ జురెల్ అహ్మదాబాద్‌లో అద్భుతం సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తన టెస్ట్ కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ సాధించిన తర్వాత అతను ఒక వినూత్న శైలిలో సెల్యూట్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ గాయం కారణంగా కొంత కాలం జట్టుకు దూరమయ్యాడు. అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ధ్రువ్ జురెల్ అదరగొట్టాడు. సెంచరీ కొట్టిన తర్వాత అతను ఒక ప్రత్యేకమైన రీతిలో సెల్యూట్ చేసి సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత, ధ్రువ్ జురెల్ తను ఎవరికి సెల్యూట్ చేశాడో స్వయంగా వెల్లడించాడు.
పూర్తి ఆత్మవిశ్వాసంతో..
వెస్టిండీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో జురేల్.. పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు అద్భుతమైన సిక్స్‌లు కూడా బాదాడు. ఇటీవలే ఆస్ట్రేలియా-ఎతో మ్యాచ్‌లు ఆడాడు. అవి అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రోత్సాహమూ జురేల్‌ను ముందుకునడిపిస్తున్నాయి. టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ తనను తాను సిద్ధం చేసుకుంటూ, పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నాడు. ‘ప్రత్యర్థి జట్టు స్వ్కాడ్‌ను పరిశీలించా. అందులో ఎంతమంది సీమర్లు, స్పిన్నర్లు ఉన్నారో గమనించా. వాళ్ల ప్లాన్ ఏమిటా.. అని ఆలోచించా. దానికి తగ్గట్లు నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నా. సీనియర్ల విలువైన సలహాలు, సూచనలు తీసుకుంటున్నా. వాళ్ల అనుభవం నాకు మార్గనిర్దేశనం చేస్తోంది’ అని ధ్రువ్‌జురేల్ వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందు అన్నాడు.
నో రిషబ్ పంత్.. నో ప్రోబ్లమ్
భారత టెస్టు జట్టులో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లేని లోటును ధ్రువ్ జురెల్ తీర్చాడు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో జురెల్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. పంత్ గాయపడంతో తన దక్కిన అవకాశాన్ని జురెల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ధ్రువ్ జురెల్ గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై భారత తరపున టెస్టు అరంగేట్రం చేశాడు. తన డెబ్యూ సిరీస్‌లో జురెల్ తన ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నాడు. కానీ రిషబ్ పంత్ రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా ఉండడంతో జురెల్ ఇప్పటివరకు టీమిండియా తరపున కేవలం 6 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అక్టోబర్ 19 నుంచి టీమ్ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులోభాగంగా మూడు వన్డేలు, అయిదు టీ20లు ఆడనుంది. వన్డే జట్టుకు ధ్రువ్ జురేల్ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. ఆసీస్ గడ్డపై అతడు వన్డేల్లోనూ రాణించి, నిలకడగా పరుగులు రాబట్టగలిగితే, భవిష్యత్తులో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్‌గానూ ఎదిగే అద్భుత అవకాశముంది. ధ్రువ్ జురేల్ ఇప్పటివరకు టీమ్ఇండియా తరఫున 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 47.5 సగటుతో 380 పరుగులు చేశాడు. 4 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.